Just In
- 6 min ago
క్రాక్ పనైపోయినట్లే.. మెగా ప్రొడ్యూసర్ షాకింగ్ డిసిషన్.. బాక్సాఫీస్ రికార్డులకు 'ఆహా' బ్రేక్
- 9 min ago
బిగ్ బాస్ తర్వాత తొలి సినిమా: కథ విన్నానంటూ అభిజీత్ పోస్ట్.. చివర్లో అలా ట్విస్ట్ ఇవ్వడంతో షాక్
- 32 min ago
ఆ హీరోయిన్లపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు: వాళ్లలా తాను అలాంటి బ్రాలు వేసుకోనంటూ చూపించింది!
- 53 min ago
హీరో అవ్వడానికి అసలు కారణమిదే.. ఆ హీరోను చూసిన రోజే నిర్ణయించుకున్నా: యాంకర్ ప్రదీప్
Don't Miss!
- Lifestyle
శరీర వాసన కూడా వయస్సుతో మారుతుంది; ఇవి కొన్ని సూచనలు
- Sports
Thailand Open: ప్చ్.. డబుల్స్‌లోనూ నిరాశే!
- News
Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా
- Finance
Union Budget 2021:ఆ ఉద్యోగస్తులకు బడ్జెట్లో ఎలాంటి ఊరట ఉండే ఛాన్స్ ఉంది..?
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ నిర్ణయంతో హృదయం బద్దలైంది.. రజనీకాంత్‌పై కుష్బూ ఎమోషనల్ కామెంట్స్
రజనీకాంత్ రాజకీయాల్లోంచి తప్పుకోవడంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు సరైన నిర్ణయం తీసుకున్నారని అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఎంతో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రజనీకాంత్ నిర్ణయాలు, ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. డిసెంబర్ 31 పార్టీ ప్రకటన ఉంటుందని, కొత్త ఏడాదిలో కొత్త పార్టీ ప్రకటిస్తాడని అభిమానులు ఎదురుచూశారు. కానీ తాజాగా పరిస్థితి మొత్తం తారుమారైంది.

వారం రోజుల విశ్రాంతి..
అన్నాత్తె షూటింగ్‌లో కరోనా కలకలం సృష్టించడం, రజనీకి నెగెటివ్ రావడం అందరికీ తెలిసిందే. అయితే రక్త పోటు సమస్యలతో రజనీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. గతంలో కిడ్నీ మార్చడంతో రజనీకి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వారం రోజులుగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. కరోనా సోకే అవకాశం ఉన్న పరిస్థితులకు రజనీ దూరంగా ఉండాలని హెచ్చరించారు.

రజనీ ప్రకటన..
రజనీకాంత్ తాజాగా ఓ సెన్సేషనల్ ప్రకటన చేశాడు. నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ అయింది.. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.. ఎంతో నష్టం వచ్చింది..అదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించిందని రజనీకాంత్ ఎమోషనల్ అయ్యాడు.

ఆ బాధ నాకు తెలుసు..
నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు.. కానీ నా వల్ల మిగతా వారంతా సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు.. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు.. రాజకీయాల్లోకి రావడం లేదు..ఈ ప్రెస్ నోట్ రాసేప్పుడు కలిగిన బాధ నాకు మాత్రమే తెలుసంటూ రజనీ అందరినీ కదిలించాడు.

హృదయం బద్దలైంది..
రజనీకాంత్ నిర్ణయంపై కుష్బూ ఎమోషనల్ అయింది. డియర్ రజనీ సర్.. మీ నిర్ణయం ఎంతో మంది తమిళుల హృదయాన్ని బద్దలుకొట్టేసింది. కానీ నాకు సమస్య పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు.. మీ స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. నాకు మీరు అత్యంత విలువైన, ఎంతో ముఖ్యమైనవారు. జాగ్రత్తగా ఉండండి.. సంతోషంగా ఉండండని కుష్బూ ట్వీట్ చేసింది.