For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBDMaheshBabu: మహేశ్ వల్లే బతికిన ఆ వేయి మంది.. సూపర్ స్టార్ గురించి తెలియని నిజాలివే!

  |

  అత్యుత్తమ నటనతో మెప్పించిన అతడు.. ఆ తర్వాత 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సాగిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో పదుల సంఖ్యలో అవార్డులను సైతం అందుకున్నాడు. కెరీర్ పరంగా ఇవన్నీ అతడిని ఓ స్టేజ్‌లో నిలబెట్టాయి. అయితే, మహేశ్ బాబు ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అలాగే, కష్ట కాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా అండగా నిలిచాడు. అవన్నీ అతడి గొప్పదనాన్ని చాటి చెప్పాయి. ఆ వివరాలను తెలుసుకుందాం!

  #HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
   సినిమాల పరంగా అలా.. వ్యక్తిగతంగా ఇలా

  సినిమాల పరంగా అలా.. వ్యక్తిగతంగా ఇలా

  తెలుగులో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో భాగంగానే తొలినాళ్ల నుంచే కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. అలాగే, వ్యాపార ప్రకటనలు చేస్తూ, నిర్మాతగా సినిమాలు తీస్తూ భారీగానే లాభాలను అర్జిస్తున్నాడు. అలాగే, సినిమాలకూ రెమ్యూనరేషన్ పరంగా అత్యధిక మొత్తం తీసుకుంటున్నాడు. అయితే, అందులో చాలా వరకూ సమాజ సేవకే ఉపయోగిస్తున్నాడు.

  Bigg Boss షోపై నోరు జారిన సెలెబ్రిటీ: సీక్రెట్ ఫోన్ కాల్‌ను లీక్ చేయడంతో బట్టబయలు

  రెండు గ్రామాలను దత్తత తీసుకున్న స్టార్

  రెండు గ్రామాలను దత్తత తీసుకున్న స్టార్

  సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతంలో గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న అతడు.. ఆ ఊరిలో అన్ని సదుపాయాలు చక్కగా ఉండేలా అభివృద్ధి చేయించాడు. అలాగే, కొన్నేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. అక్కడ కూడా వాళ్లకు లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇక, ఇటీవలే ఈ రెండు గ్రామాల్లోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లను కూడా వేయించాడు. ఇది మహేశ్ బాబు గొప్పదనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

  ఎన్నో సందర్భాల్లో విరాళాలు ప్రకటించాడు

  ఎన్నో సందర్భాల్లో విరాళాలు ప్రకటించాడు

  చేతి నిండా సినిమాలు, ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తోన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆపద సమయాల్లో ప్రజలకు, ప్రభుత్వాలను తన వంతుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. చాలా రోజుల క్రితం వచ్చిన హుద్‌హుద్ తుఫాను నుంచి నిన్నటి కరోనా పరిస్థితుల వరకు అతడు ఎన్నో విరాళాలు ప్రకటించాడు. అయితే, ఇవి ఏమాత్రం తక్కువ ఉండవు. తన స్థాయికి తగ్గట్లుగానే భారీ మొత్తాలను డొనేషన్ చేస్తున్నాడు. తద్వారా కష్ట కాలంలో నేనున్నాను అంటూ నిలబడుతున్నాడు. ఇది మహేశ్ బాబు ఔదార్యానికి ఉదాహరణ.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్ మంజూష: అదిరిపోయే ఫోజులతో ఘాటు ఘాటు ఫోజులు

  వేయి మందికి పైగా సర్జరీలు చేయించాడు

  వేయి మందికి పైగా సర్జరీలు చేయించాడు

  సుదీర్ఘమైన కెరీర్‌లో టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన మంచి పనులు, విరాళాలు ఒక ఎత్తు అయితే.. MBForSavingHearts పేరిట చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించడం మరో ఎత్తు. ఇప్పటి వరకూ సూపర్ స్టార్ వేయి మందికి పైగానే చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. తద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశాడు. అదే సమయంలో ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులను నింపాడు. ఇంతటి గొప్ప పని చేసినా మహేశ్ బాబు దీని గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. ఇది అతడి సింప్లిసిటీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

  సమాజ సేవలో భాగం అయ్యేందుకు ఇలా

  సమాజ సేవలో భాగం అయ్యేందుకు ఇలా

  సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మహేశ్ బాబు.. కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఇలా అతడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో కూడా ఈ స్టార్ హీరో సమాజం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ప్రజలందరినీ ప్రతి విషయంలోనూ అప్రమత్తం చేస్తుంటాడు. అలాగే, వాళ్లను చైతన్య పరిచేలా పోస్టులు పెడుతున్నాడు. అంతేకాదు, ఒక యాడ్‌తో కోట్లకు కోట్లు సంపాదించే మహేశ్ బాబు సమాజం కోసం ‘హీల్‌ ఏ చైల్డ్‌' అనే స్వచ్ఛంద సంస్థకు కూడా గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  అలాంటి సినిమాలతో ఆదర్శంగా నిలుస్తూ

  అలాంటి సినిమాలతో ఆదర్శంగా నిలుస్తూ

  దాదాపు పాతికేళ్ల సినీ ప్రస్థానంలో మహేశ్ బాబు హీరోగా 26 సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో చాలా వరకూ కమర్షియల్ చిత్రాలే ఉన్నా.. ఈ మధ్య కాలంలో సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ‘శ్రీమంతుడు' అనే సినిమాతో గ్రామాలను దత్తత తీసుకోవాలన్న మెసేజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘మహర్షి'తో వ్యవసాయం చేయాల్సిన అవసరాన్ని చూపించాడు. సినిమాల్లో చెప్పిన ఈ మెసేజ్‌లకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అనుసరిస్తున్నారు. ఇలా గొప్ప గొప్ప చిత్రాలు, పాత్రలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడీ స్టార్ హీరో.

  సంబరాలు.. నిరుత్సాహం లేని హీరోగానే

  సంబరాలు.. నిరుత్సాహం లేని హీరోగానే

  సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశాడు. అయితే, అతడు ఎప్పుడూ విజయానికి పొంగిపోలేదు. అలాగే, పరాజయానికి కృంగిపోలేదు. ఇలా ప్రతి పరిస్థితిని చక్కగా తీసుకుంటూ కూల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అలా తన వ్యక్తిత్వంతోనూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుస హిట్లను అందుకుని దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. ఇప్పుడు ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమాను చేయబోతున్నాడు.

  ఇలా కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకుంటూ.. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Tollywood Super Star Mahesh Babu Celebrating His Birthday Today. On The Occasion of This Day.. Let We Know About His Good Works, Helps and Donations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X