ఫలించిన మహేష్ జోస్యం.. మహర్షికి అవార్డును ముందే పసిగట్టిన సూపర్‌స్టార్..వంశీ పైడిపల్లి వాట్సాప్ ఛాట్‌‌ లీక్!

సినిమా పరిశ్రమలో విజయాలను అంచనా వేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఉన్న గ్రిప్ మరో కుటుంబానికి ఉండదంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి సంఘటనకు ఉదాహరణ నిలిచే విధంగా మహేష్ అంచనా ఫర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ కావడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మహర్షి సినిమాకు ముందు వాట్సాప్‌లో మహేష్ షేర్ చేసిన విషయాన్ని వంశీ పైడిపల్లి సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. ఆ విషయాల్లోకి వెళితే...

ఊపిరి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు

ఊపిరి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు


మహేష్, దిల్ రాజు కాంబినేషన్‌లో మహర్షి మూవీ ప్రారంభం కావడానికి ముందు వంశీ పైడిపల్లి తీసిన ఊపిరి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ సమయంలో వంశీ పైడిపల్లికి మహేష్ బాబు కంగ్రాట్స్ చెప్పి మంచి మాటలతో అభినందించారు.

మన సినిమాకు నేషనల్ అవార్డు

మన సినిమాకు నేషనల్ అవార్డు

ఊపిరి సినిమాకు ఫిలింఫేర్ అలవార్డు రావడం గురించి విన్నాను. సినిమాకు మంచి గౌరవం లభించింది. మన కాంబినేషన్‌లో వచ్చే సినిమా (మహర్షి)కు జాతీయ అవార్డు రావడం గ్యారెంటి అంటూ వంశీ పైడిపల్లికి మహేష్ బాబు వాట్పప్ సందేశం పంపారు.

మహేష్ సార్.. మీ మాట నిజం చేయడానికి..

మహేష్ సార్.. మీ మాట నిజం చేయడానికి..

అయితే మహర్షి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో మహేష్ నుంచి వచ్చిన సందేశానికి వంశీ పైడిపల్లి సంతోషంలో మునిగిపోయారు. థ్యాంక్యూ వెరీ మచ్ సార్.. మీ మెసేజ్ నాలో మరింత విశ్వాసాన్ని పెంపొందించింది. తప్పకుండా మీ మాటను నిజం చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ మహేష్‌కు వంశీ సమాధానం ఇచ్చారు.

మహర్షిని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లు...

మహర్షిని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లు...

ఆ తర్వాత వంశీకి మహేష్ మరో మెసేజ్ పంపుతూ... మన సినిమాకు ఏం కావాలో అది చేయి. నీకు అండగా నేను ఉంటాను. మన సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లు అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.

Recommended Video

Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్
మహేష్ మీరు చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ

మహేష్ మీరు చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ


మహర్షి సినిమాకు ముందు మహేష్‌తో జరిగిన వాట్సప్ సంభాషణను వంశీ పైడిపల్లి తన ట్విట్టర్‌లొ షేర్ చేశారు. మీ నమ్మకం, విశ్వాసం మహర్షి సినిమాకు ఈ రోజు ఇలాంటి గౌరవం దక్కేలా చ సింది. 2017లో మీరు చెప్పిన మాటలు నిజమయ్యాయి అంటూ వంశీ పైడిపల్లి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X