Just In
- 2 min ago
వాళ్ళు ఒప్పుకుంటే వెండితెరపై SPB బయోపిక్.. మొదటిసారి క్లారిటీ ఇచ్చిన బడా వ్యాపారవేత్త
- 12 min ago
Check Movie 4days collections: ఒక్కసారిగా పడిపోయిన ‘చెక్’ కలెక్షన్స్.. ఇంకా అంత వస్తేనే హిట్టైనట్లు
- 46 min ago
ఎమ్మెల్యేగా పా రంజిత్.. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దం.. జాతీయపార్టీ గ్రీన్ సిగ్నల్!
- 1 hr ago
యువ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్
Don't Miss!
- News
భారత్-పాక్ కాల్పుల విరమణ- ఇమ్రాన్ ఖాన్ మాస్టర్ ప్లాన్- సైనిక పాలన తప్పించే యత్నం ?
- Automobiles
ఫిబ్రవరి 2021లో టాప్ 10 కార్ బ్రాండ్స్
- Sports
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి!!
- Lifestyle
March Born People: మార్చిలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...
- Finance
బంగారం ధరలు తగ్గాయి, 387% పెరిగిన దిగుమతులు: ఇన్వెస్ట్ చేయడమే మంచిదా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అడ్డంగా బుక్కైన సినీ జంట: ఆ హీరోను ఏకంగా ఇంటికి తీసుకెళ్లిన నటి.. అలా కనిపించి దొరికిపోయారు!
సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకు అనుగుణంగానే బాలీవుడ్‌లో తరచూ ఏదో ఒక ఎఫైర్ గురించి వార్తలు రావడం.. అవి అక్కడ హాట్ టాపిక్ అవడం జరుగుతూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చనీయాంశం అవుతోన్న జంటల్లో మలైకా అరోరా.. అర్జున్ కపూర్ జోడీ ఒకటి. వయసులో చాలా తేడా ఉన్నా ఈ ఇద్దరూ ప్రేమలో ఉండడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. వీళ్ల పెళ్లి గురించీ తరచూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వీళ్లిద్దరూ అడ్డంగా బుక్కైపోయారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

తెలుగులో ఆ ఇద్దరు హీరోలతో సయ్యాట
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేసింది మలైకా అరోరా. అదే సమయంలో చాలా సినిమాలకు స్పెషల్ సాంగ్స్ చేసింది. అందులో ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ', ‘మున్నీ బద్నామ్ హుయే' వంటి హిందీ పాటలు గుర్తింపును తెచ్చాయి. తెలుగులో ‘అతిథి'తో మహేశ్‌తో, ‘గబ్బర్ సింగ్'లో పవన్ కల్యాణ్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసింది.

సల్మాన్ తమ్ముడితో పెళ్లి... బ్రేకప్ కూడా
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా. ఆ తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు.

12 ఏళ్ల చిన్న హీరోతో డేటింగ్‌తో ఉందిగా
భర్తకు విడాకులు ఇచ్చిన కొన్నేళ్లకే మలైకా అరోరా.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన బాలీవుడ్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. చాలా కాలంగా బంధాన్ని కొనసాగిస్తోన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ ఫొటోను షేర్ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్ చేసింది. తర్వాత అతడు మేటర్ రివీల్ చేశాడు.

పెళ్లికి ముందే కాపురం.... కలిసే ఉంటూ
డేటింగ్ చేస్తున్నప్పటికీ.. ఈ జంట ఎవరి కంటా పడకుండా చాలా జాగ్రత్త పడింది. కానీ, ఎప్పుడైతే తమ బంధాన్ని బయట పెట్టుకున్నారో.. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తెగ రెచ్చిపోతున్నారు. తరచూ డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటివి చేస్తున్నారు. అదే సమయంలో ఎప్పుడూ కలిసే కనిపిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు.

త్వరలోనే పెళ్లి.. ఇంకా సమయం రాలేదా
మలైకా అరోరా.. అర్జున్ కపూర్ చాలా రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అంతేకాదు, పలుమార్లు వీళ్ల రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘నిజంగా పెళ్లి చేసుకుంటే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాం' అని ఇద్దరూ వెల్లడించారు.

హీరోను ఏకంగా ఇంటికి తీసుకెళ్లిన నటి
వీలు దొరికనప్పుడల్లా జంటగా దర్శనమిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మలైకా అరోరా.. అర్జున్ కపూర్. దీంతో వీళ్లిద్దరి గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంట ఇప్పుడు మరోసారి రహస్యంగా ఓ ఇంటి దగ్గర కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అలా కనిపించి అడ్డంగా బుక్కైన జంట
మలైకా అరోరా.. శుక్రవారం రాత్రి అర్జున్ కపూర్‌తో కలిసి తన తల్లి ఇంటికి వెళ్లింది. ఒకే కారులో కలిసి వెళ్లిన వీళ్లిద్దరూ.. అక్కడ చాలా సమయం గడిపారు. వీళ్ల వెంట మలైకా కుమారుడు, ఆమె సోదరి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, తన తల్లి ఇంటికి మొదటిసారి అర్జున్ కపూర్‌ను తీసుకెళ్లడంతో.. పెళ్లి గురించిన చర్చలు జరిపారన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.