ఆహాలో మళ్లీ చూడు బ్రో.. నెటిజన్‌కు ఎంఎస్ రాజు కౌంటర్
డర్టీ హరి సినిమాతో ఎంఎస్ రాజు ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. డర్టి హరీ లాంటి బోల్డ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీయగలిగారా? అని నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ప్రచార చిత్రాలు, టీజర్లు, ట్రైలర్లు మరీ శ్రుతి మించినట్టు ఉండటంతో అందరూ డర్టీ హరిపై నెగెటివ్ భావనతోనే ఉన్నట్టున్నారు. కానీ సినిమాలో మంచి సందేశం ఉందని, క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని తెలుసుకున్న వారు సోషల్ మీడియాలో ఎంఎస్ రాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే కొంత మంది డర్టి హరిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాటిపైనా ఎంఎస్ రాజు అంతే హుందాగా స్పందిస్తున్నారు. నెటిజన్లకు మంచిగా కౌంటర్లు ఇస్తున్నాడు. ఇలాంటి సినిమాలు తీయకండని ఎంఎస్ రాజును ఓనెటిజన్ కోరాడు. ఇంకా సుత్తి సినిమాలు తీయాలా? ఇకపై ఎవ్వరినీ ఒప్పించేందుకు సినిమాలు తీయనని ఎంఎస్ రాజు చెప్పుకొచ్చాడు. తాజాగా మరో నెటిజన్ వేసిన సెటైర్‌కు ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చాడు.

ఆహా యాప్‌లో డర్టీ హరి అందుబాటులో ఉందని చెబుతూ వేసిన ట్వీట్‌పై ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు. నేను ఆల్రెడీ మూవీరూల్జ్‌లో చూసేశాను బ్రో అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా నెటిజన్ కామెంట్ పెట్టడంతో ఎంఎస్ రాజు తిరిగి ట్వీట్ చేస్తూ.. మళ్లీ ఆహాలో చూడండి బ్రో అని కౌంటర్ వేశాడు. దీంతో సదరు నెటిజన్ తోక ముడిచినట్టుగా బ్రహ్మానందం జిఫ్ ఫైల్‌ను షేర్ చేశాడు. ఏది ఏమైనా ఎంఎస్ రాజు మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు.



Click it and Unblock the Notifications











