దేవుడిని నమ్మని నాలాంటి వాడి జీవితంలో.. నిహారికపై నాగబాబు ఎమోషనల్
మెగా బ్రదర్ నాగబాబుకి తన కూతురు నిహారిక అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఓ ఫిలాసఫర్, ఫ్రెండ్, గైడ్‌గా ఉంటూ మంచి తండ్రిగా నాగబాబు నిలిచాడు. నిహారిక పెళ్లి చేసుకుని వెళ్లిపోతోన్న తరుణంలో నాగబాబు చేసిన పోస్ట్ అందరినీ కదిలించింది. చిన్నతనంలో నిహారిక స్కూల్‌కు వెళ్లిన తరుణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా నిహారిక బర్త్ డే సందర్బంగా నాగబాబు మరోసారి అందరినీ కదిలించే పోస్ట్ పెట్టాడు.

స్పెషల్ విషెస్..
మెగా డాటర్ నిహారిక బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. హీరోయిన్లలో ముఖ్యంగా లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ, కాజల్ అగర్వాల్ స్పెషల్ విషెస్ అందించారు. కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుష్మిత ఇలా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో అపురూపమైన ఫోటోలు షేర్ చేస్తూ విషెస్ అందించారు.

మొదటి బర్త్ డే..
పెళ్లయ్యాక నిహారిక ఫస్ట్ బర్త్ డే కావడంతో చైతన్య స్పెషల్ విషెస్ అందించాడు. నిహారిక తన ఎదపై వాలిన ఫోటోను చైతన్య షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే లవ్.. నువ్ నన్ను ఎల్లప్పుడూ ఎంత సంతోషంగా ఉంచుతున్నావో.. ఈ రోజు కూడా నువ్ అంతే సంతోషంగా ఉండాలి.. నా పొద్దు తిరుగుడు పువ్వా.. ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి అంటూ నిహారికపై ప్రేమను కురిపించాడు.

నాగబాబు ఎమోషనల్..
నిహారిక బర్త్ డే సందర్భంగా నాగబాబు స్పందిస్తూ... డియర్ నీహా.. దేవుడిని నమ్మని ఓ వ్యక్తి జీవితంలోకి నువ్ వచ్చావ్.. ఏంజిల్స్ ఉంటారని నమ్మేలా చేశావ్.. నీ చూపులో నేను గొప్పవాడిగా ఉండేందుకు నేను ఎన్నో యుద్దాలు చేస్తాను.. నిన్ను నవ్వించేందుకు ఎంతటి కింది స్థాయికైనా సరే దిగుతానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

ఎప్పుడూ ప్రేమిస్తాను..
ఈ పెళ్లి జరగడంతో మనం ఇంకా దగ్గరయ్యామని జనాలు అనుకుంటున్నారు.. కానీ నీ మీదు నాకున్న ప్రేమను రియలైజ్ అయ్యాను.. మామూలుగా నీపై ప్రేమ నేను అనుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా ఉందని నాకు అర్థమైంది.. హ్యాపీ బర్త్ డే నాన్నా.. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. .డాడు అంటూ నిహారిక చిన్న నాటి ఫోటోను నాగబాబు షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











