For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak: రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్‌కు నాగబాబు ఝలక్.. బోడి గుండే అంటూ షాకింగ్‌గా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో రకరకాల జోనర్లలో రూపొందుతోన్న బడా సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు మల్టీస్టారర్ జోనర్‌లో వస్తున్నాయి. అలాంటి వాటిలో భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది భారీ బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మెగా బ్రదర్ నాగబాబు ఊహించని పోస్ట్ చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీ అందరి కోసం!

   బిగ్ స్టార్స్ కాంబోలో భీమ్లా నాయక్

  బిగ్ స్టార్స్ కాంబోలో భీమ్లా నాయక్

  పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో రూపొందిన భారీ చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను అందించాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్: ఆ నటుడితో డేటింగ్.. ఇప్పుడు మరీ ఘోరంగా!

  భారీగా బిజినెస్... గ్రాండ్‌గా రిలీజ్

  భారీగా బిజినెస్... గ్రాండ్‌గా రిలీజ్

  విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'భీమ్లా నాయక్' మూవీకి అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ గ్రాండ్‌గా విడుదలైంది. మొత్తంగా దీన్ని 2000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  అదిరిపోయే టాక్.. ఫ్యాన్స్ ఖుషీగా

  అదిరిపోయే టాక్.. ఫ్యాన్స్ ఖుషీగా

  'భీమ్లా నాయక్' మూవీ మాస్ రివేంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో స్పెషల్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

  వెట్ బాడీ సెల్ఫీతో ఇలియానా రచ్చ: పై నుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!

  భారీ ఓపెనింగ్స్... రికార్డులు బ్రేక్

  భారీ ఓపెనింగ్స్... రికార్డులు బ్రేక్

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్సే వస్తోంది. అలాగే, ఈ చిత్రానికి రివ్యూలు కూడా పాజిటివ్‌గా వస్తున్నాయి. దీనికితోడు తెలంగాణలో ఐదు షోలు ప్రదర్శితం కాబోతున్నాయి. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉంది.

  సెలెబ్రిటీల నుంచి స్పెషల్ పోస్ట్

  సెలెబ్రిటీల నుంచి స్పెషల్ పోస్ట్

  టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్‌కు సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది ప్రముఖులు వీక్షించేశారు. ఈ మేరకు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు. దీంతో 'భీమ్లా నాయక్' పేరు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

  Bheemla Nayak: ఏపీ ప్రభుత్వానికి పవన్ ఫ్యాన్స్ షాక్.. చందాలు వేసుకుని ఏ అభిమానులూ చేయని విధంగా!

  పవన్ ఫ్యాన్స్‌కు నాగబాబు ఝలక్

  పవన్ ఫ్యాన్స్‌కు నాగబాబు ఝలక్

  భారీ అంచనాల నడుమ 'భీమ్లా నాయక్' మూవీ ఈరోజు (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుమారు 2000లకు పైగా థియేటర్లలో ఇది గ్రాండ్‌గా విడుదలైంది. దీంతో మెగా హీరోలు సైతం ఈ సినిమాకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు.. పవన్ అభిమానులకు తన పోస్టుతో షాక్ ఇచ్చాడు.

  బోడి గుండును చూపిస్తూ ఫన్నీగా

  బోడి గుండును చూపిస్తూ ఫన్నీగా

  'భీమ్లా నాయక్' మూవీ టికెట్ల గురించి నాగబాబును చాలా మంది అడుగుతున్నారట. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విక్రమార్కుడు సినిమాలో బోడి గుండును చూపించే వీడియోను షేర్ చేశాడు. దీనికి 'నన్ను భీమ్లా నాయక్ టికెట్లు అడిగే వాళ్లకు ఇదే నా సమాధానం' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశాడు. ఇలా పవన్ ఫ్యాన్స్‌కు మెగా బ్రదర్ షాకిచ్చాడు. ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Did Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Now Nagababu Did Funny Post on This Movie Tickets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion