For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.. మాకు గొడవలు జరుగుతున్నాయి: నాగబాబు

  By Manoj
  |

  మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని ముందుకెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుంద' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ కుర్రాడు.. ఆ తర్వాతి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న వరుణ్ తేజ్... పర్సనల్ లైఫ్‌లో మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడట. ఈ విషయాన్ని ఆయన తండ్రి నాగబాబు వెల్లడించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  ఆ విషయంలో సక్సెస్.. అందుకే హిట్లు

  ఆ విషయంలో సక్సెస్.. అందుకే హిట్లు

  ప్యూర్ లవ్ స్టోరీతో తీసిన ‘ముకుంద'తో కెరీర్‌ను ప్రారంభించాడు వరుణ్ తేజ్. దీని తర్వాత ‘కంచె' అనే సినిమా చేశాడు. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినప్పటికీ.. ‘ఫిదా'తో స్టార్ హీరో అయిపోయాడు. దీని అనంతరం ‘తొలిప్రేమ', ‘F2' తదితర హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

  ఎవరూ చేయని ప్రయోగంతో విజయం

  ఎవరూ చేయని ప్రయోగంతో విజయం

  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే గత ఏడాది ‘గద్దలకొండ గణేష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. మరీ ముఖ్యంగా ఇందులో వరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. విలన్‌గా అతడి గెటప్ కూడా ఆకట్టుకుంది.

  బాక్సర్‌గా మారిన మెగా వారి అబ్బాయి

  బాక్సర్‌గా మారిన మెగా వారి అబ్బాయి

  కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న తర్వాత వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో అతడు ఫైటర్‌లా కనిపించనున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు బాబీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

  వరుణ్ తేజ్‌కు ఆ అమ్మాయితో వివాహం

  వరుణ్ తేజ్‌కు ఆ అమ్మాయితో వివాహం

  వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే మరిన్ని చిత్రాల్లో నటించేందుకు అతడు ముందుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి వివాహం జరగబోతుందని ఆ మధ్య ఓ వార్త బయటకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తెతో వరుణ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం జరిగింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

  వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు కామెంట్స్

  వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు కామెంట్స్

  తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ వివాహంపై ఆయన తొలిసారి స్పందించారు. ‘మేము నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. ఒకటి సెట్ అయ్యేలా ఉంది. అదే సమయంలో వరుణ్ బాబుకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం. కుదిరితే రెండు పెళ్లిళ్లు ఒకే ఏడాది పెళ్లి చేస్తాం' అని ఆయన చెప్పుకొచ్చారు.

  పెళ్లి విషయంలో గొడవలు జరుగుతున్నాయి

  పెళ్లి విషయంలో గొడవలు జరుగుతున్నాయి

  పెళ్లి విషయంలో తమ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని నాగబాబు తెలిపారు. ‘నిహారిక మేము చూసిన అబ్బాయిని చేసుకుంటానని చెప్పేసింది. అందుకే సంబంధాలు చూడడం ప్రారంభించాం. అయితే, వరుణ్ బాబు మాత్రం ఇప్పుడే వద్దంటున్నాడు. వాడి గురించి గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా ఒప్పుకుంటాడని నమ్మకం ఉంది' అని వివరించారు.

  Star Heros Special Target On Dussehra Holidays
  వరుణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు

  వరుణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు

  ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ గురించి ఓ విషయాన్ని బయట పెట్టాడు మెగా బ్రదర్. ‘నిహారిక పలానా క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని అడగలేదు. కాకపోతే వరుణ్ మాత్రం ఇంట్లోనే ఉండిపోయే అమ్మాయి కాకుండా... బయటి విషయాలపై స్పందిస్తూ, ప్రొఫెషనల్‌గా ఉండాలి అంటున్నాడు. అలాంటి అమ్మాయినే చేసుకుంటా అని అప్పట్లో చెప్పాడు' అని నాగబాబు వెల్లడించారు.

  English summary
  Konidela Nagendra Babu is an Indian actor and producer associated with the Telugu film industry. He acts mainly in supporting roles and villain roles, though he has also played the lead role in some films. He has acted in 143, Anji, Shock, Sri Ramadasu, Chandamama and Orange.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X