twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొడగొట్టి డైలాగ్ చెబితే.. ఎవడి మాట వినని సీతయ్యగా.. హరికృష్ణ సినిమాలు ఇవే..

    By Rajababu
    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా హరికృష్ణ సినీ జీవితాన్ని ప్రారంభించారు. చిన్నతనంలోనే బాల నటుడిగా 60వ దశకంలోనే కొన్ని చిత్రాల్లో నటించారు. హరికృష్ణ తొలిసారి 11 ఏళ్ల వయసులో శ్రీ కృష్ణావతారం చిత్రంలో నటించారు. ఆ తర్వాత తల్లా పెళ్లామా?, తాతమ్మ కల, రాం రహీమ్ లాంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం 2005లో శ్రావణమాసం. ఇలా నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్న హరికృష్ణ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాలో మృత్యువాత పడ్డారు. సోలో హీరోగా నటించిన చిత్రాల్లో ఆయన తొడగొట్టి డైలాగ్ చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకొన్నది. ఆయన నటించిన సినిమాల గురించి..

    Recommended Video

    Nandamuri Harikrishna's Movie Journey
    1967లో శ్రీ కృష్ణావతారంలో

    1967లో శ్రీ కృష్ణావతారంలో

    1967లో ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన శ్రీ కృష్ణావతారం అనే చిత్రంలో హరికృష్ణ బాలనటుడిగా నటించారు. ఆ చిత్రంలో హరికృష్ణ బాలకృష్ణుడి పాత్రను పోషించారు. కృష్ణుడిగా స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన హరికృష్ణకు 11 ఏళ్లు ఉండటం గమనార్హం.

    1977లో దానవీర శూర కర్ణలో

    1977లో దానవీర శూర కర్ణలో

    1977లో స్వర్గీయ ఎన్టీఆర్ నటించి, నిర్మించి దర్శకత్వం వహించిన దానవీర శూర కర్ణ చిత్రంలో హరికృష్ణ నటించారు. ఆ చిత్రంలో బాలకృష్ణ అర్జునుడి పాత్రలో నటించారు. పౌరాణిక చిత్రాలంటే హరికృష్ణకు ఎంతో ఇష్టం.

     శ్రీరాములయ్యలో కామ్రేడ్ సత్యంగా

    శ్రీరాములయ్యలో కామ్రేడ్ సత్యంగా

    1998లో పరిటాల రవి నిర్మాతగా రూపొందించిన శ్రీరాములయ్య చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. కామ్రేడ్ సత్యం పాత్రలో కనిపించిన ఆయన ప్రేక్షకుల హృదయాలను తన నటనతో కదిలించారు.

    నాగార్జునతో కలిసి

    నాగార్జునతో కలిసి

    1999లో దర్శకుడు వైవీఎస్ చౌదరీ రూపొందించిన సీతారామరాజు చిత్రంలో నాగార్జునతో కలిసి హరికృష్ణ నటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హిందీలో ఏక్ ఔర్ హకీఖత్ అనే పేరుతో డబ్ అయింది.

    వైవీఎస్ చౌదరీతో మరోమారు

    వైవీఎస్ చౌదరీతో మరోమారు

    2002లో వైవీఎస్ దర్శకత్వంలోనే హరికృష్ణ లాహిరి లాహిరి లాహిరిలో అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు నటించారు. సీనియర్ నటి లక్ష్మీ విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.

    సోలోగా సీతయ్యలో

    సోలోగా సీతయ్యలో

    2003లో వైవీఎస్ చౌదరీ, హరికృష్ణ కాంబినేషన్ రిపీట్ అయింది. సీతయ్య పేరుతో వచ్చిన చిత్రంలో హరికృష్ణ సోలోగా పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఆ చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. సిమ్రాన్ హీరోయిన్‌గా నటించిన ఆ చిత్రంలోని పాటలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. సీతయ్య ఎవడి మాట వినడు అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది.

    కెరీర్‌లో హరికృష్ణ ఆణిముత్యాలు

    కెరీర్‌లో హరికృష్ణ ఆణిముత్యాలు

    తన కెరీర్‌లో హరికృష్ణ శివ రామరాజు, టైగర్ హరిచంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం లాంటి చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇటీవల సినిమాల్లో కనిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం తన బరువును కూడా తగ్గించుకొన్నారు.

    English summary
    Nandamuri Harikrishna passed away early on Wednesday following an accident on the Narketpally-Addanki highway in Nalgonda district. He is known for his notice-worthy performances in films like Laahiri Laahiri Laahirilo (2002) and Seetayya (2003).His son NT Rama Rao Junior, popularly known as Jr NTR, is a popular actor in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X