For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బేబీ బ్రదర్‌తో నిహారిక సందడి: సర్‌ప్రైజ్‌ చేసి సస్పెన్స్‌గా ఉంచి.. మెగా కిడ్‌ను గుర్తుపట్టారా!

  |

  నిహారిక కొణిదెల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నాగబాబు కుమార్తెగా మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుందామె. తద్వారా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. ఫలితంగా బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుని సత్తా చాటింది. ఇలా కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలోనే మెగా డాటర్ వివాహం జరిగిపోయింది. అయినప్పటికీ కెరీర్‌ను మాత్రం ఆపలేదు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో బిగ్ బ్రదర్ అంటూ ఓ కుర్రాడితో కలిసి ఉంది. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా?

   అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా పాపులారిటీ

  అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా పాపులారిటీ

  మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ' అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా పని చేసింది. అక్కడ తనదైన హోస్టింగ్‌తో మెప్పించిన ఈ అమ్మాయి.. రెండు సీజన్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. తద్వారా నటిగా తన స్టామినాను అందరికీ పరిచయం చేసింది. అదే సమయంలో పాపులారిటీని సైతం బాగానే సంపాదించుకుంది.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  సినిమాల్లోకి ఎంట్రీ.. నిరాశ తప్పలేదుగా

  సినిమాల్లోకి ఎంట్రీ.. నిరాశ తప్పలేదుగా

  కెరీర్ ఆరంభంలో యాంకర్‌గా, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటిన నిహారిక.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. నాగశౌర్య నటించిన ‘ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైందామె. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత ఈ మెగా డాటర్ ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో సినిమాలకు దూరం అయింది. ఈ క్రమంలోనే ‘సైరా: నరసింహారెడ్డి' మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.

  అతడితో వివాహం.. పెళ్లి తర్వాత సందడి

  అతడితో వివాహం.. పెళ్లి తర్వాత సందడి

  కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న సమయంలో గత ఏడాది నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో ఈ వేడుక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక, వివాహం తర్వాత నిహారిక హాలీడే ట్రిప్‌లు, పార్టీలు అంటూ తన పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గానే ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

  బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్: అలా తీసిన ఫొటోలో అందాల అరబోత

  ఇప్పుడు కూడా బిజీగానే... ఆపలేదుగా

  ఇప్పుడు కూడా బిజీగానే... ఆపలేదుగా

  పెళ్లికి ముందు కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు పలు వెబ్ సిరీస్‌లను నిర్మించింది నిహారిక. ఈ క్రమంలోనే వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను ఆపకూడదని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు. అలాగే, తన సొంత బ్యానర్‌పై మరో వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కించింది. దీనికి మాత్రం ఆమె కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఇలా పెళ్లైనా కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందీ బ్యూటీ.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా.. మెగా డాటర్ నిహారిక కొణిదెల మాత్రం చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ ఆమె తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే కెరీర్‌కు సంబంధించిన విశేషాలను కూడా వెల్లడిస్తోంది. తద్వారా సినిమాల్లో పెద్దగా నటించకున్నా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఫలితంగా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

  Bheemla Nayak సెట్స్‌లో గన్‌తో కనిపించిన పవన్: స్టైల్‌గా ఎలా ఫైరింగ్ చేస్తున్నాడో చూడండి!

  రాఖీ సంబరాలు... ఫొటోలు, వీడియోలు

  రాఖీ సంబరాలు... ఫొటోలు, వీడియోలు

  ఈ ఏడాది మెగా అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు ఒకేరోజు రెండు పండుగలు వచ్చాయి. అదేనండీ చిరంజీవి పుట్టినరోజుతో పాటు రాఖీ పండుగ ఒకేసారి వచ్చింది. దీంతో వీటిని అందరూ సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో సైతం ఆనందం వెల్లివిరిసేలా అందరూ ఒకేచోట కలిశారు. మరీ ముఖ్యంగా నిహారిక కూడా ఈ సంతోషంలో భాగం అయింది. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరులు వరుణ్ తేజ్, రామ్ చరణ్ సహా అందరికీ రాఖీలు కట్టింది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం మెగా డాటర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
   బిగ్ బేబీ బ్రదర్‌తో నిహారిక సందడి చేస్తూ

  బిగ్ బేబీ బ్రదర్‌తో నిహారిక సందడి చేస్తూ

  పండుగను పురష్కరించుకుని తన సోదరులకు రాఖీ కట్టిన నిహారిక.. ఒకరోజు ఆలస్యం మరొకరికి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఓ కుర్రాడిని వెనుక నుంచి హగ్ చేసుకుని ఉన్న ఫొటోను షేర్ చేసిన ఈమె.. ‘కొంచెం ఆలస్యంగా.. మా బిగ్ బేబీ బ్రదర్‌కు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తను ఎవరో క్లూ ఇవ్వాల్సిన అవసరం లేదు' అంటూ పోస్ట్ పెట్టింది. ఇక, ఇందులో ఉన్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ అన్న విషయం అర్థం అవుతూనే ఉంది. దీంతో వీళ్లిద్దరి బాండింగ్ చూసిన మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Mega Daughter Nikarika Konidela Very Active in Social Media. Now She Shared A Pic with Pawan Kalyan Son Akira Nandan. This is Gone Be Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X