‘జనతా హోటల్’ ఐదో టీజర్ విడుదల! .. స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే..
Recommended Video

విలక్షణ నటుడు, మహానటి ఫేం దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన 'జనతా హోటల్' ఐదో టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నిర్మాత సురేష్ కొండేటి ఈ టీజర్‌ను సినిమాతో సంబంధం లేని వ్యక్తి వాయిస్‌తో చేయించారు. రేడియో మిర్చిలో పనిచేసే ప్రముఖ రేడియో జాకీ సునీత వాయిస్‌తో చేయించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. సునీత హస్కీ వాయిస్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది.
'మహానటి' సినిమాలో 'అమ్మాడీ..' అంటూ అమ్మాయిలను మంత్రముగ్ధులను చేసిన దుల్కర్ సల్మాన్ గురించి ఈ టీజర్‌లో ఉంది.

మలయాళంలో ఘనవిజయం సాధించి ఇంటర్‌నేషనల్ ఫిల్మ్‌ఫెస్ట్‌కు సెలెక్ట్ అయిన 'ఉస్తాద్ హోటల్'ను తెలుగులో 'జనతా హోటల్' పేరుతో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాకు తొలుత తెలుగులో 'జతగా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఆ టైటిల్‌తోనే తొలుత టీజర్‌ను విడుదల చేశారు. అయితే జతగా టైటిల్ బాగా లేదని, జతగా అనే టైటిల్ కంటే 'జనతా హోటల్' అని పెడితే బాగుంటుందని నిర్మాత సురేష్ కొండేటికి నీత్యామీనన్ సజెస్ట్ చేసింది. ఆ టైటిల్ ఆయనకు నచ్చడంతో చివరికి దాన్నే ఫిక్స్ చేసి విడుదలకు సిద్దం చేశారు.


Click it and Unblock the Notifications











