For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమె కోసం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ.. కావాలంతే!

  |

  సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కసారి దశ తిరిగిందంటే ఇక వెనుదిరిగే ఛాన్సే ఉండదు. కాకపోతే ఆ టైమ్ కలిసి రావడమే కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది పక్కాగా చూస్తుంటాం. సక్సెస్ కోసం ఎంత పాకులాడినా రాణి ఫలితం ఒకే ఒక్క సినిమాతో వచ్చేసి స్టార్ స్టేటస్ తెచ్చిపెడుతుంటుంది. హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు ప్రేక్షకులు. అందుకే పూజా కూడా చాలా డిమాండింగ్ గా ఉందట. ఆ వివరాలేంటో చూద్దామా..

  టాలీవుడ్ లో బెస్ట్ ఆప్షన్

  టాలీవుడ్ లో బెస్ట్ ఆప్షన్

  తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లకు కొదవే లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇలాటి తరుణంలో టాలీవుడ్ లో బెస్ట్ ఆప్షన్‌గా మారింది పూజా హెగ్డే. ఇప్పుడున్న మన తెలుగు యంగ్ హీరోలకు సరైన జోడీ అనిపించుకుంటూ డిమాండ్ అంతకంతకూ పెంచుకుంది పూజా.

  ఎన్టీఆర్ సినిమాతో సక్సెస్ టేస్ట్

  ఎన్టీఆర్ సినిమాతో సక్సెస్ టేస్ట్

  ముకుంద సినిమాతో సినీ జర్నీ మొదలుపెట్టిన పూజా హెగ్డే.. వరుసపెట్టి తెలుగు సినిమాలు చేసింది. కానీ ఆమెకు సక్సెస్ టేస్ట్ దొరికింది మాత్రం ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' సినిమా రూపంలోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో పూజా జోష్ మరింత ఊపందుకుంది.

  స్టార్ హీరోలతో రొమాన్స్.. వరుసగా

  స్టార్ హీరోలతో రొమాన్స్.. వరుసగా

  ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమాలో నటించిన తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ వస్తోంది పూజా. మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో, వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్ సినిమాలో నటించి అందం, అభినయం పరంగా నేటితరం హీరోయిన్లలో తానూ ప్రత్యేకం అని నిరూపించుకుంది. దీంతో ఆమెనే కావాలని కోరుకుంటున్నారు స్టార్ హీరోలు.

  ఆమె కోసం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ..

  ఆమె కోసం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ..

  ప్రస్తుతం పూజా డిమాండ్ చూసిన దర్శకనిర్మాతలు ఆమెకు ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఎలాగైనా తమ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఉండాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెకు దాదాపు 2 కోట్ల రూపాయల దాకా రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నట్లుగా సమాచారం.

   కావాలంతే.. అనేలా పాపులారిటీ

  కావాలంతే.. అనేలా పాపులారిటీ

  నేటి తరం ప్రేక్షకులు కోరుకునే విధంగా అందాల ప్రదర్శనకీ అడ్డు చెప్పకపోవడం, డేట్ల విషయంలో మరీ కచ్చితంగా ఉండకపోవడం ఆమెకు కలిసొస్తున్న అంశాలని తెలుస్తోంది. సరైన సమయానికి షూటింగ్ స్పాట్ కి రావడం కూడా పూజాకీ ప్లస్‌‌ అవుతోందట. పూజలో ఇవన్నీ చూసి ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

  ప్రభాస్ తో బ్యూటీ రొమాన్స్

  ప్రభాస్ తో బ్యూటీ రొమాన్స్

  ప్ర‌స్తుతం ప్రభాస్‌- రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు గాను ఆమెకు 2 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ ఇచ్చుకున్నారట. ఇక ఇటీవలే విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాకు కూడా కోటికి పైగానే తీసుకుందని సమాచారం. అంటే సినిమా సినిమాకు ఆమె డిమాండ్ అమాంతం పెరుగుతోందన్నమాట.

  బన్నీకి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన పూజా

  బన్నీకి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన పూజా

  ఇక అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న అల.. వైకుంఠపురములో సినిమాలోనూ పూజా పాత్ర స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈ మేరకు ఇటీవలే విడుదలైన పోస్టర్ లో చేతికి గ్లౌజులు వేసుకొని అల్లువారబ్బాయికి పంచ్ ఇచ్చేందుకు ఆమె రెడీ అవుతున్నట్లుగా కనిపించింది పూజా.

  పూజా జోష్ చూస్తుంటే..

  పూజా జోష్ చూస్తుంటే..

  టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రసీమ కూడా పూజా పై కన్నేసింది. అక్కడి నుంచి కూడా ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ లెక్కన ప్రభాస్, అల్లు అర్జున్ తో ఆమె నటిస్తున్న ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే ఇక పూజాను అందుకోవడం ఏ హీరోయిన్ తరం కాదేమో!.

  English summary
  Allu Arjun and trivikram new movie Ala Vaikutapuramlo release date fixed. This movie will release on january 12th 2020. Now this movie Fresh poster released and getting huge response from the audience. So Pooja Hegde demand increased in tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X