For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు. దీంతో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రభాస్ విషయంలో రెండు కోరికలు ఉండేవని.. అవి తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారని ఓ విషయం బయటకు వచ్చింది. అదే సమయంలో రెబెల్ స్టార్ పొలిటికల్ గానూ ఓ విషయం నిరాశనే ఎదుర్కొన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

  కోవిడ్ తర్వాత తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు (83).. ఆదివారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించింది. దీంతో ఆయన ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు ప్రాణాలు విడిచారు.

  Krishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డు

  రెండు రంగాల్లో తనదైన ముద్ర వేసి

  రెండు రంగాల్లో తనదైన ముద్ర వేసి

  సినీ నటుడిగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు దాదాపు ఆరు దశాబ్దాల పాటు తన సేవలను అందించారు. అలాగే రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేసుకుని క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరణించడం ఈ రెండు రంగాలకు తీరని లోటును మిగిల్చిందనే చెప్పాలి. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు మరణంతో సంతాపం తెలుపుతున్నారు.

   ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ చేసి

  ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ చేసి

  రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు సంతానంగా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఆయన సోదరుడి కుమారుడైన ప్రభాస్‌ను సినీ రంగానికి పరిచయం చేశారు. యంగ్ రెబెల్ స్టార్‌గా పరిచయం అయిన అతడు.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అతడు ఈ రేంజ్‌కు రావడం వెనుక కృష్ణంరాజు కృషి కూడా ఎంతో ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  ప్రభాస్ పెళ్లి చూడకుండానే మృతి

  ప్రభాస్ పెళ్లి చూడకుండానే మృతి

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే వారు. అంతేకాదు, అతడి పెళ్లి గురించి కూడా ఆయన ఎంతగానో ఆలోచించే వారు. ఈ విషయాన్ని కృష్ణంరాజే స్వయంగా పలుమార్లు మీడియాకు వెల్లడించారు. చివరికి ఆయన ప్రభాస్ పెళ్లిని చూడకుండానే ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం ఈ విషయం హైలైట్ అవుతోంది.

  ఒక్క అడుగు కూడా పడకుండానే

  ఒక్క అడుగు కూడా పడకుండానే

  సుదీర్ఘ కాలం పాటు హీరోగా, నిర్మాతగా ఎన్నో సినిమాలను చేసిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. దర్శకత్వం వైపు కూడా వెళ్లాలని భావించారు. కానీ, ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణంరాజు గతంలో 'ఒక్క అడుగు' అనే స్క్రిప్టును రెడీ చేశారు. ఇది ప్రభాస్ హీరోగా తీయాలని అనుకున్నారు. కానీ, ఈ కోరిక కూడా తీరకుండానే ఆయన మరణించారు.

  స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

  పొలిటికల్‌గానూ కోరిక తీరలేదుగా

  పొలిటికల్‌గానూ కోరిక తీరలేదుగా

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు చాలా కాలం పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే చాలా ఏళ్లుగా భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు గవర్నర్ పదవిని ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, ఇది కూడా అందకుండానే ఆయన చనిపోయారు.

  ప్రభాస్‌తో భారీ హిట్ కొట్టాలని ప్లాన్

  ప్రభాస్‌తో భారీ హిట్ కొట్టాలని ప్లాన్

  గతంలో కృష్ణం రాజు - ప్రభాస్ కాంబినేషన్‌లో 'బిల్లా', 'రెబెల్' అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండూ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ 'రాధే శ్యామ్'లో తన పెదనాన్నకు ఓ ప్రత్యేకమైన పాత్రను ఇచ్చాడు ప్రభాస్. ఇది కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. దీంతో వీళ్లిద్దరి కలయికలో భారీ హిట్ బాకీ పడిపోయింది. ఇక, ఇప్పుడు అది చూడకుండానే కృష్ణంరాజు ప్రాణాలు విడిచారు.

  English summary
  Famous Actor Krishnam Raju Passes Away Due to Health Issues. Lets Know about His Wish on Prabhas Movie and Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X