For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో బిగ్ బాస్ బ్యూటీతో రాహుల్ డేటింగ్: రియల్ రిలేషన్‌షిప్‌‌ సీక్రేట్ బట్టబయలు..

  |

  రాహుల్ సిప్లీగంజ్.. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. చిన్న వయసులోనే అంతలా గుర్తింపు పొందాడీ కుర్రాడు. సింగర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫలితంగా పెద్ద సినిమాల్లో పాడే ఛాన్స్ పొందాడు. కెరీర్ పరంగా ఎంత పాపులర్ అయ్యాడో.. తన వ్యవహార శైలితోనూ అదే రితీలో ఫేమస్ అయ్యాడు. ఇప్పటికే పునర్నవితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న టాక్ నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరొకరితో రిలేషన్‌లో ఉన్నానని ప్రకటించాడు. ఆ వివరాలు మీకోసం.!

  అందరు హీరోలను టచ్ చేసేశాడు

  అందరు హీరోలను టచ్ చేసేశాడు

  కెరీర్ ఆరంభంలో ఎన్నో పాటల కార్యక్రమాల్లో పాల్గొన్నాడు రాహుల్ సిప్లీగంజ్. అలా అలా సాగిపోతోన్న సమయంలో అక్కినేని నాగ చైతన్య డెబ్యూ మూవీ ‘జోష్'లోని ‘కాలేజ్ బుల్లోడా' అనే పాటతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత దాదాపు అందరు హీరోలనూ కవర్ చేశాడు. రాహుల్ కెరీర్‌లో ‘దమ్ము', ‘ఈగ', ‘రచ్చ', ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'లోని పాటలు గుర్తింపు తెచ్చాయి.

  వాటి వల్లే క్రేజ్ దక్కించుకున్నాడు

  వాటి వల్లే క్రేజ్ దక్కించుకున్నాడు

  సినిమా పాటల వల్ల రాహుల్ సిప్లీగంజ్ ఎంత ఫేమస్ అయ్యాడో.. ప్రైవేటు ఆల్బమ్‌లతో అంతకు మించిన క్రేజ్‌ను అందుకున్నాడు. 2013లో ‘మగజాతి' అనే పాట సూపర్ సక్సెస్ అవడంతో వరుసగా వాటిని చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే ‘ఎందుకే', ‘మంగమ్మ', ‘మైసమ్మ', ‘పూర్ బాయ్', ‘మాక్కికిరికిరి', ‘దూరమే', ‘గల్లీ కా గణేష్' సహా ఎన్నో పాడి యూత్ ఐకాన్‌గా మారాడు.

  అంచనాలు లేకుండా వెళ్లి విన్నర్

  అంచనాలు లేకుండా వెళ్లి విన్నర్

  సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్‌లతో కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఎంతో మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్న ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లాడతను. అయితే, ఊహించని విధంగా అద్భుతమైన ఆటతీరుతో బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.

  లవ్ ట్రాక్‌తో రాహల్ హాట్ టాపిక్

  లవ్ ట్రాక్‌తో రాహల్ హాట్ టాపిక్

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తోటి కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో రాహుల్ లవ్ ట్రాక్ నడిపించాడు. మూడో సీజన్ విజయం సాధించడానికి ఇదే ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా వీళ్లిద్దరూ షోలో తరచూ హగ్ చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకోవడం వంటివి చేసి మసాలను దట్టించారు.

  మరో బిగ్ బాస్ బ్యూటీతో డేటింగ్

  పునర్నవితో రిలేషన్‌ విషయంలో రాహుల్ ఎప్పుడూ నోరు మెదపలేదు. పైగా మరింత క్లోజ్‌గా ఉంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు పెంచేశాడు. ఇక, ఇదే విషయంపై అతడి తల్లిదండ్రులు కూడా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ మరో బిగ్ బాస్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

  Cheppina Evvaru Nammaru Lyrical Song Launch
  రియల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని

  రియల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని

  బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషు రెడ్డితో రాహుల్ డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని అతడే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు, ‘మేమిద్దరం సినిమా ప్రమోషన్ కోసమో.. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమో కలవలేదు. మేము నిజమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నాము' అంటూ ప్రకటించాడు. రాహుల్ చేసిన పోస్టుపై అలీ రేజా కూడా స్పందించడం విశేషం.

  English summary
  After months of rigorous battles and blame game, Nagarjuna’s Bigg Boss Telugu 3 got its winner in Rahul Sipligunj. It was a tough competition between finalists Rahul, Ali Reza, Sreemukhi, Baba Bhaskar and Varun Sandesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X