For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, చరణ్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ప్రకటన చేసింది ఒకరు.. ప్లాన్ మరొకరిది.!

  By Manoj Kumar P
  |

  కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లోకి వస్తున్నారో లేదో.. ఆ తర్వాత కూడా ఎన్నో ప్రచారాలు మొదలయ్యాయి. 'పింక్' రీమేక్ తర్వాత పవన్ పలానా సినిమాలో చేస్తున్నాడని కొందరు అంటుంటే.. కాదు కాదు వేరే దర్శకుడికి ఫిక్స్ అయ్యాడని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో ఆయన నిర్మాతగానూ మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మెగా కాంబినేషన్ గురించి కూడా చర్చ ప్రారంభం అయింది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా అప్‌డేట్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  మెగా ఫ్యాన్స్ ఎదురు చూసేది దాని గురించే

  మెగా ఫ్యాన్స్ ఎదురు చూసేది దాని గురించే

  అక్కినేని కుటుంబంలోని నటులంతా కలిసి చేసిన చిత్రం ‘మనం'. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఇండస్ట్రీలోనే క్లాసిక్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. దీంతో టాలీవుడ్‌లోని అన్ని ఫ్యామిలీలు అదే తరహా సినిమా చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలందరూ కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నారు.

  ఆ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు

  ఆ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు

  మెగా ఫ్యామిలో దాదాపు పది మంది హీరోలు ఉన్నారు. దీంతో ఈ కుటుంబంలోని హీరోలు కలిసి సినిమా చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి.. పవన్ కలిసి సినిమా చేస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు కూడా. ఆ తర్వాత చిరు, చరణ్ కలుస్తారని అన్నారు. అలాగే, పవన్ - చరణ్, వరుణ్ - సాయి ధరమ్ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

  రామ్ చరణ్‌తో పవన్ కల్యాణ్ మూవీ

  రామ్ చరణ్‌తో పవన్ కల్యాణ్ మూవీ

  కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ నటించిన ఓ సినిమా ఫంక్షన్‌కు పవన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆ సమయంలో తాను త్వరలోనే చరణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తానని పవన్ ప్రకటించాడు. ఇదే విషయంపై ఇటీవల స్పందిస్తూ... ‘గతంలో చెప్పినట్లుగానే చరణ్‌తో సినిమా త్వరలోనే ఉంటుంది. సరైన కథతో ఏ దర్శకుడైనా వస్తే అది స్టార్ట్ అవుతుంది' అని ఆయన వెల్లడించారు.

  ఆల్రెడీ పవన్ మొదలెట్టేశాడు

  ఆల్రెడీ పవన్ మొదలెట్టేశాడు

  వాస్తవానికి పవన్ కల్యాణ్ నిర్మాతగా ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో తమ సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్‌పై చిరంజీవితో వచ్చిన సినిమాలే చాలా ఉన్నాయి. ఇక, ఇటీవల ఆయన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. దీని పైనే ‘సర్ధార్ గబ్బర్ సింగ్', ‘ఛల్ మోహన్ రంగా' అనే సినిమాలు రూపొందించాడు.

  ప్రకటన చేసింది ఒకరు.. ప్లాన్ మరొకరిది.!

  ప్రకటన చేసింది ఒకరు.. ప్లాన్ మరొకరిది.!

  రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు. అయితే, దీనికి నిర్మాత, హీరో తారుమారయ్యారని అంటున్నారు. అంటే.. రామ్ చరణ్ నిర్మాణంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించబోతున్నాడని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది.

  మొదలయ్యేది ఎప్పుడో కూడా తెలిసింది

  మొదలయ్యేది ఎప్పుడో కూడా తెలిసింది

  ప్రస్తుతం రామ్ చరణ్ RRR షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీనితో పాటు చిరంజీవి - కొరటాల శివ సినిమానూ నిర్మిస్తున్నాడు. ఈ రెండూ వచ్చే ఏడాది ప్రథమార్ధం అయ్యే సరికి పూర్తయిపోతాయని అంటున్నారు. అంతేకాదు, పింక్ రీమేక్ కూడా అప్పటికి కంప్లీట్ అవుతుందని సమాచారం. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో సినిమాను నిర్మిస్తాడట చెర్రీ.

  English summary
  Pawan Kalyan bid adieu to films before he jumped into politics full-time. He contested in the recently-concluded Lok Sabha Elections in two seats but lost by a huge margin. If sources are to be believed, Pawan Kalyan is keen on giving back to films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X