For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Charan Marriage Anniversary : ఉపాసనను చరణ్ ఫస్ట్ టైమ్ కలిసింది అక్కడే.. పిల్లల గురించి అడిగితే!

  |

  'చిరుత' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. ఘనమైన ఆరంభాన్ని దక్కించుకున్న అతడు.. రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన కామినేనిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా తమదైన రంగాల్లో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందీ జంట. ఇక, నేడు చరణ్ - ఉపాసన పెళ్లిరోజు. ఈ సందర్భంగా వాళ్ల ప్రేమకథలో కొన్ని అంశాలను తెలుసుకుందాం!

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
  రామ్ చరణ్ ఇలా.. ఉపాసన అలా

  రామ్ చరణ్ ఇలా.. ఉపాసన అలా

  చిరంజీవి కుమారుడిగా పరిచయమై ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక, ఉపాసన అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. అనిల్ - శోభన దంపతుల కుమార్తె. ఇప్పుడు ఈమె అపోలో సంస్థలకు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

  ఇద్దరు ఫస్ట్ టైమ్ కలిసింది అక్కడే

  ఇద్దరు ఫస్ట్ టైమ్ కలిసింది అక్కడే

  రామ్ చరణ్ - ఉపాసనది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందే ఈ జంట ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలింది. అసలు వీళ్లిద్దరి కలయిక ఎక్కడ జరిగిందంటే.. ఓ సారి రామ్ చరణ్ స్పోర్ట్ క్లబ్ మీటింగ్‌కు వెళ్లాడు. అక్కడే ఉపాసనతో అతడికి పరిచయం అయింది. ఆ తర్వాత కూడా పలుమార్లు వీళ్లు కలుసుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి ప్రేమగా మారింది.

  ఐదేళ్ల ప్రేమ.. ఎలా సాగిందో తెలుసా

  ఐదేళ్ల ప్రేమ.. ఎలా సాగిందో తెలుసా

  రామ్ చరణ్ - ఉపాసన ప్రేమలో ఉన్న విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచుకున్నారు. ఇంట్లో వాళ్లే కాదు.. స్నేహితులకు సైతం ఈ మేటర్ గురించి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక, ఈ సమయంలో వీళ్లిద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవారట. అయితే, అవన్నీ సీరియస్‌గా కాదు.. సరదాగానే. వాటి వల్ల వీళ్లిద్దరి బంధం మరింత బలపడిందని ఉపాసన ఆ మధ్య చెప్పింది.

  పెద్దలను ఒప్పించి.. చాలా గ్రాండ్‌గా

  పెద్దలను ఒప్పించి.. చాలా గ్రాండ్‌గా

  దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత తమ బంధం గురించి రామ్ చరణ్.. ఉపాసన వాళ్ల వాళ్ల ఇంట్లో చెప్పేశారు. దీనికి పెద్దలు కూడా అంగీకరించడంతో 2011 డిసెంబర్ 11న వీళ్లిద్దరి నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారు.

  9 ఏళ్ల బంధం.. పిల్లల గురించి ఇలా

  9 ఏళ్ల బంధం.. పిల్లల గురించి ఇలా

  రామ్ చరణ్.. ఉపాసన పెళ్లి జరిగి నేటికి 9 ఏళ్లు కావొస్తుంది. అయితే, ఈ జంటకు ఇప్పటి వరకూ పిల్లలు పుట్టలేదు. దీని గురించి ఆ మధ్య ఉపాసన స్పందిస్తూ.. ‘ప్రెగ్నెంట్ అవ్వడం అనేది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. మేము ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని అనుకున్నాము. ఎప్పుడు పేరెంట్స్ అవ్వాలన్న దానిపై మా ఇద్దరికీ క్లారిటీ ఉంది' అంటూ స్పష్టం చేసిందామె.

  పెళ్లి తర్వాత సత్తా చాటుతోన్న ఉప్స్

  పెళ్లి తర్వాత సత్తా చాటుతోన్న ఉప్స్

  అపోలో సంస్థల వైస్ చైర్మన్‌గా ఉన్న ఉపాసన కామినేని.. వివాహం తర్వాత కూడా అందులో కంటిన్యూ అవుతూ ఎన్నో మెరుగైన సేవలను చేస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో అన్నింట్లో చైతన్యం కలిగించే ఎన్నో కార్యక్రమాలను స్వయంగా చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తద్వారా మహిళలకు ఆదర్శంగా ఉంటున్నారు.

  రామ్ చరణ్ చేస్తున్నది ఏమిటంటే?

  రామ్ చరణ్ చేస్తున్నది ఏమిటంటే?

  ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రాల్లో RRR ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఇది రూపొందుతోంది. ఇందులో చరణ్.. అల్లూరిగా నటిస్తున్నాడు. దీనితో పాటు కొరటాల - చిరు కలయికలో వస్తున్న ‘ఆచార్య'లోనూ నటిస్తున్నాడు. అలాగే, శంకర్‌తో ఓ సినిమాను ప్రకటించాడు.ఇక ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటోన్న రామ్ చరణ్ - ఉపాసన జంటకు ఫిల్మీబీట్ తరపున శుభాకాంక్షలు.

  English summary
  Mega Power Star Ram Charan and Upasana Kamineni Wedding Anniversary Today. On The Occasion of This Day.. Lets Know Best Moments in Their Love Journey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X