»   » పార్టీలు, పబ్బలకు దూరం, నోట్లో ఐస్ పెట్టుకుని:.... ఎన్టీఆర్‌పై రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్!

పార్టీలు, పబ్బలకు దూరం, నోట్లో ఐస్ పెట్టుకుని:.... ఎన్టీఆర్‌పై రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' ఫస్ట్ వీకెండ్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌తో పాటు చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు, ఫ్యాన్స్ షాకయ్యే సంఘటనలు వెల్లడించారు. ఈ సినిమా కోసం భగభగ మండే ఎండాకాలంలో ఆయన ఎంతలా శ్రమించారో తెలిపారు. రేసు కార్లు, రేసు బైకులు ప్రత్యేకంగా ఎలా తయారు చేయబడతాయో.... సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ అలా తయారు చేయబడిదంటూ పొగడ్తలు గుప్పించారు.

  ఆయనే బ్రేక్ వేశారు

  ఆయనే బ్రేక్ వేశారు

  వాస్తవానికి క్లైమాక్స్‌లో భారీ ఫైట్ ఉండాలి. డైరెక్టర్ చెప్పినట్లు మేము ముందే డిజైన్ చేశాం. వారం పది రోజుల షెడ్యూల్ కూడా అనుకున్నాం. అయితే సినిమాలో ఫైట్ లేకుండా ఉండటానికి కారణం ఎన్టీఆరే... ఆయనకు ఫస్ట్ థాంక్స్ చెప్పాలి. మాస్టర్ నాకు ఇది రావడం లేదు, ఇండస్ట్రుగా ఉండటం లేదని చెప్పి బ్రేక్ వేశాడని రామ్ లక్ష్మణ్ మాస్టర్ తెలిపారు

  రిస్క్ అని తెలిసి కూడా...

  రిస్క్ అని తెలిసి కూడా...

  అపుడు అందరిని కలిసి కూర్చొబెట్టి దర్శకుడు త్రివిక్రమ్ అభిప్రాయాలు అడిగాడు. మాకు కూడా ఈ ఫైట్ అనవసరం అనిపిస్తోందని చెప్పాం. కథకు సూటవ్వట్లేదని చెప్పాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న త్రివిక్రమ్.... ఎన్టీఆర్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లేకుంటే ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారని తెలిసి రిస్క్ చేశారు. కొత్తగా మరో వెర్షన్ అప్పటికప్పుడు రాశారు అని రామ్ లక్ష్మణ్ మాస్టర్ గుర్తు చేసుకున్నారు.

  చాలా గొప్ప విషయం

  చాలా గొప్ప విషయం

  ఒక మనిషిలో పగ ఉంటే జీవితంలో ఎంత కోల్పోతాడు. పగ లేకుండా ఉంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో చూపించాడు. మమ్మల్ని ఒక ఫైట్ మాస్టర్ గా కాకుండా ఆయనతో సమానంగా చూసుకున్నారు. మా అభిప్రాయాలకు గౌరవం ఇచ్చారు. ప్రతి టెక్నీషియన్ తో దర్శకుడు బావుంటే మంచి ఔట్ పుట్ వస్తుందనిడానికి ‘అరవింద సమతే' సినిమా నిదర్శనమని రామ్ లక్ష్మణ్ అన్నారు.

  పబ్బులకు వెల్లలేదు, నోట్లో ఐస్ పెట్టుకుని

  పబ్బులకు వెల్లలేదు, నోట్లో ఐస్ పెట్టుకుని

  ఎన్టీఆర్ కష్టపడినదాంట్లో మేము 1 పర్సంట్ కూడా కష్టపడలేదు. ఎండాకాలంలో కేవలం నోట్లొ ఐస్ ముక్క పెట్టుకుని పని చేశాడు. వాటర్ కూడా తాగలేదు. సిక్స్ ప్యాక్ కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. పబ్బులకు పార్టీలకు వెళ్లకుండా సిస్టమేటిక్‌గా డైట్ కంట్రోల్ చేశారు... అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్నారు.

  సినిమాల కోసం తయారు చేయబడ్డాడు

  సినిమాల కోసం తయారు చేయబడ్డాడు

  రేసుల కోసం బైకులను, కార్లను సపరేట్‌గా మానుప్యాక్చర్ చేస్తారు. సినిమాల కోసం తయారు ప్రత్యేకంగా చేసిన బాడీయే ఎన్టీఆర్ బాడీ... అంటూ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ప్రశంసల వర్షం కురపించారు.

  English summary
  Ram Laxman masters speech at Aravindha Sametha Success meet. Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde and Eesha Rebba in the lead roles Sunil, Naga Babu, Jagapathi Babu and Supriya Pathak in supporting roles.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more