Just In
- 8 hrs ago
విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
- 8 hrs ago
Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం
- 9 hrs ago
ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
- 10 hrs ago
అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- News
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం... సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ఆ ఇన్నోవా కారు...
- Finance
Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
ఆకట్టుకునే అందం, అభినయంలో రాణిస్తూ చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించింది ప్రముఖ హీరోయిన్ రోజా. సాదాసీదా అమ్మాయిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె... తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించిందామె. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ఎంటరై అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజా.. తెలుగులో తన అభిమాన హీరో ఎవరో రివీల్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రోజా నేపథ్యం ఇదే.. మొదటి బ్రేక్ అక్కడే
చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీలత రెడ్డి అలియాస్ రోజా 1991లో విడుదలైన ‘సర్పయాగం'తో సినిమా రంగంలోకి ప్రవేశించింది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించింది. దీంతో ఆమెకు నంది అవార్డ్ కూడా దక్కింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది. అదే సమయంలో దక్షిణాదిలోని మిగతా భాషల్లోనూ సినిమాలు చేసి హవాను చూపించిందామె.

సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతోంది
చాలా కాలం పాటు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా... సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దుమ్ముదులిపేసింది. ఆ మధ్య ‘శంభో శివ శంభో' అనే సినిమాలో చక్కని పాత్రను పోషించిన ఆమె.. ‘గోలీమార్'లోనూ మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సహాయ నటి పాత్రలు దక్కించుకుంది. ఇలా చాలా రోజుల పాటు సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమె ఈ మధ్య బ్రేక్ తీసుకుంది.

బుల్లితెరపై సత్తా.. జబర్ధస్త్‌గా సాగుతోంది
సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రోజా... బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘మోడ్రన్ మహాలక్ష్ములు' అనే షోతో ఆరంగేట్రం చేసిన ఆమె... ఫేమస్ కామెడీ షో ‘జబర్ధస్త్'తో క్రేజ్ దక్కించుకుంది. మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... ఏడేళ్లుగా జబర్ధస్త్‌కు జడ్జ్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ షోకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.

రాజకీయాల్లోనూ తిరుగులేని హీరోయిన్
సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ ఎంటర్ అయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ హీరోయిన్.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది.

తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా
సంక్రాంతి సందర్భంగా రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన అభిమాన హీరో గురించి చెబుతూ.. ‘తెలుగులో చాలా మంది ఫేవరెట్ హీరోలు ఉన్నారు. ఇప్పుడున్న వారిలో అయితే మాత్రం రవితేజ అంటే ఇష్టం. అతడివి అన్ని సినిమాలూ చూస్తాను' అని పేర్కొందామె.

అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణి కూడా తెలుగు సినిమాలు, తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ‘నేను ఈ మధ్య సినిమాలు చేయట్లేదని అంతా అడుగుతున్నారు. వాస్తవానికి నాకో స్టైల్ ఉంది. అది ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పటి వాళ్లు నాలా ట్రై చేయడం లేదు. అలాంటోల్ల వల్లే సినిమాలు చేయడం లేదు' అంటూ చెప్పుకొచ్చారు.