Sachin Tendulkar with AR Rahman గాడ్ ఆఫ్ క్రికెట్‌తో గాడ్ ఆఫ్ మ్యూజిక్ రెహ్మాన్ పార్టీ.. ట్వీట్ వైరల్
క్రికెటర్లు, సినీ తారల మధ్య స్నేహం, రిలేషన్‌షిప్ కొత్తేమీ కాదు. 80వ దశకం నుంచి క్రికెట్, సినీ రంగాల మధ్య ధృడమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధాలు ఇప్పటికీ రెండు రంగాల మధ్య కొనసాగుతున్నాయి. అందుకు సాక్ష్యంగా సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహ్మాన్ నిలిచారు. ఈ విషయాన్ని గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్ చేసిన ట్వీట్‌తో బయట ప్రపంచానికి తెలియజేశారు.
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్, రెహ్మాన్ మధ్య ఫ్రెండ్‌షిప్ చాలా కాలంగా కొనసాగుతున్నది. అప్పుడప్పుడు వేడుకల్లో, పార్టీలలో కలుసుకోవడం తెలిసిందే. అయితే వీరిద్దరి ఆదివారం రోజున కలుసుకొని అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం రెహ్మాన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సచిన్ టెండూల్కర్‌ను కలిసిన విషయాన్ని ఏఆర్ రెహ్మాన్ వెల్లడిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్‌తో కలిసి కొంత సమయాన్ని గడిపాను అంటూ వారిద్దరు కలిసిన ఫోటోను షేర్ చేశాడు. వారిద్దరూ బాంద్రాలోని ఎంసీఏ క్లబ్‌లో కలిసినట్టు హ్యాష్ ట్యాగ్ ద్వారా వెల్లడించారు. సచిన్ టెండూల్కర్‌కు ట్యాగ్ చేశాడు. #friendshipgoals #mcabandraclub
ఇక ఏఆర్ రెహ్మాన్ ట్వీట్‌కు స్పందిస్తూ.. సంగీత సునామీ ఏఆర్ రెహ్మాన్‌తో సండే అద్బుతంగా గడిచిపోయింది అని సచిన్ టెండూల్కర్ బదులిచ్చాడు.
ఇదిలా ఉండగా, గతంలో సచిన్ టెండూల్కర్ బయోపిక్‌గా వచ్చిన సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ అనే చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2017లో ఏప్రిల్ 26వ తేదీన రిలీజైంది.


Click it and Unblock the Notifications











