Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సంజయ్ దత్.. పిక్స్ వైరల్
రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంత పెద్ద ఎత్తున విజయవంతమైందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది లాక్డౌన్ సమయంలోనే ప్రభాస్ చేతుల మీదుగా మూడో దశ ఛాలెంజ్ ప్రారంభమైంది. అలా ప్రభాస్ ప్రారంభించిన ఈ మూడో దశ నేటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఈ చాలెంజ్‌లో హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఇలా అందరూ పార్టిసిపేట్ చేశారు.
మహేష్ బాబు ఇచ్చిన చాలెంజ్ ప్రకారం తమిళ స్టార్ దళపతి విజయ్ మొక్కలు నాటి సవాల్‌ను స్వీకరించాడు. అలా కోలీవుడ్‌లోనూ ఈ చాలెంజ్ పాకింది. ఇక తాజాగా ఎంపీ సంతోష్ బాలీవుడ్ స్టార్, పెద్దన్న సంజయ్ దత్‌ను గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామిని చేశాడు. గతవారంలో ఎంపీ సంతోష్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం సంజయ్ దత్‌ను కలిశాడు. కేజీయఫ్ చాప్టర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న సంజయ్ దత్ నేడు చాలెంజ్‌ను పూర్తి చేశాడు.

ఈ మేరకు గచ్చిబౌలి ఏరియాలో కేజీయఫ్ చాప్టర్ 2 షూటింగ్‌లో సంజయ్ దత్.. మొక్కలు నాటాడు. ఈ మేరకు తన అభిమానులందరినీ మొక్కలను నాటమని కోరాడు. అలా ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆశించాడు. ప్రస్తుతం సంజయ్ దత్ పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంజూ దాదా ప్రస్తుతం కేజీయఫ్ చాప్టర్ 2లో అతి భీకరమైన అధీరా పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.