For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata Birthday Blaster: రికార్డులను ర్యాంప్ ఆడిస్తోన్న మహేశ్.. అందులో హవా

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడే. ఈ క్రమంలోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం అందుకున్నాడు. తద్వారా రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల స్పెషలిస్టుగా పేరొందిన పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.

  NTR Insta Take over RRR: రాజమౌళి కొడుకుతో రామ్ చరణ్ గొడవ.. సీక్రెట్ వీడియో లీక్ చేసిన ఎన్టీఆర్

  ఈరోజు (ఆగస్టు 9) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి పుట్టినరోజు కానుకగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. ఇందులో మహేశ్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించారు. అలాగే, అతడు చెప్పిన డైలాగ్స్, చూపించిన గ్రేస్‌ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. వీటితో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్‌గా ఉంది. వీటికి తోడు ఈ లుక్‌తో వింటేజ్ మహేశ్ బాబును గుర్తు చేశాడు చిత్ర దర్శకుడు పరశురాం.

  Sarkaru Vaari Paata Birthday Blaster Trending in Youtube

  ఎంతో స్టైలిష్‌గా వచ్చిన 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను, లైకులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ వీడియో 10 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలాగే, దాదాపు 6 లక్షల లైకులను కూడా ఖాతాలో వేసుకుంది. ఫలితంగా యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వేగం చూస్తుంటే 24 గంటల్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తోంది.

  SR Kalyanamandapam 3Days Collections: ఆ హీరోల రేంజ్‌లో వసూళ్లు.. కేవలం 3 రోజుల్లోనే అన్ని కోట్లా!

  సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఈ సినిమా అన్ని హంగులతో కలిసి ఉంటుందని తెలుస్తోంది.

  HBDMaheshBabu: మహేశ్ వల్లే బతికిన ఆ వేయి మంది.. సూపర్ స్టార్ గురించి తెలియని నిజాలివే!

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ భారీ చిత్రంలో ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. దీని కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

  English summary
  Tollywood Super Star Mahesh Babu Celebrating His Birthday Today. On The Occasion of This Day.. Sarkaru Vaari Paata Birthday Blaster Video Released. This is Trending in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X