Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
శ్రీముఖి ఊరమాస్.. స్టెప్పులతో అదరగొట్టిన శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్
బుల్లితెర మీద పలు రకాల రియాలిటీ షోలలో శ్రీముఖి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తమదైన స్టైల్లో రాణిస్తున్నారు. యాంకర్‌గా శ్రీముఖి టాప్ రేసులో దూసుకెళ్తుంటే.. శేఖర్ మాస్టర్ సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో విశేషంగా పాపులారిటీని సంపాదించుకొంటున్నారు. అయితే ఇలా బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్న ఈ ఇద్దరు సెలబ్రిటీలు కలిసి చేసిన వీడియో ఒకటి ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే...

బుల్లితెర, వెండితెర మీద
శ్రీముఖి విషయానికి వస్తే బుల్లితెర మీద యాంకర్‌గానే కాకుండా సినిమాల్లో అప్పుడప్పుడు హాట్ హాట్‌గా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. పలు రియాలిటీ షోలో గెస్టుగా పాల్గొంటూ డ్యాన్సులు, కామెడీ చేయడంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమాలను, టీవీ షోలను, మూవీ ఈవెంట్లతో బిజీగా ఉంటూ వస్తున్నారు.

అల్లరి పిల్లగా బిగ్‌బాస్‌లో
శ్రీముఖి
పాపులారిటీని
గుర్తించిన
బిగ్‌బాస్
తెలుగు
4
షో
నిర్వాహకులు
ఆమెను
పాపులర్
షోలోకి
ఆహ్వానించారు.
ఆ
షోలో
చిలిపిగా
చేసిన
శ్రీముఖి
చేసిన
అల్లరితో
మరింత
పాపులారిటిని
సంపాదించింది.
ఇక
తెలుగు
బిగ్‌బాస్
సీజన్
3లో
టైటిల్
గెలిచినంత
పనిచేసింది.
ఆ
తర్వాత
ప్రస్తుతం
కెరీర్‌పైనే
భారీగా
ఫోకస్
చేసినట్టు
కనిపిస్తున్నది.

సిగ్నేచర్ స్టెప్పులతో శేఖర్ మాస్టర్
ఇక శేఖర్ మాస్టర్ విషయానికి వస్తే... సినిమాల్లో టాప్ హీరోలకు సిగ్నేచర్ స్టెప్పులను డిజైన్ చేస్తూ కొరియోగ్రాఫర్‌గా పీక్స్‌లో ఉన్నారు. అంతేకాకుండా టెలివిజన్ రంగంలో డ్యాన్స్ రియాలిటీ షోలతోపాటు ఇతర షోల్లో గెస్గుగా, న్యాయమూర్తిగా పాల్గొంటూ మరింత పాపులారిటిని సొంతం చేసుకొంటున్నారు.

శ్రీముఖి, శేఖర్ మాస్టర్ కలిసి ఓ రేంజ్‌లో
అయితే సినిమా రంగంతోపాటు, టెలివిజన్ రంగంలో హవా కొనసాగిస్తున్న శ్రీముఖి, శేఖర్ మాస్టర్ కలిస్తే ఆ రేంజ్ వేరే ఉంటుంది. వారిద్దరు ఓ పాటకు స్టెప్పులేసి కేకపెట్టించారు. కొద్ది రోజలు క్రితం పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నది. ఈ వీడియోకు సుమారు 5 లక్షలకుపైగా లైక్స్, భారీగా కామెంట్స్ లభించాయి.
Recommended Video
తమిళ పాటకు ఊరమాస్‌గా శ్రీముఖి
తమిళ చిత్రానికి సంబంధించిన పాటకు శ్రీముఖి, శేఖర్ మాస్టర్ స్టెప్పులతో ఇరుగదీశారు. శేఖర్ మాస్టర్‌కు ధీటుగా శ్రీముఖి వేసిన స్టెప్పులకు మంచి కామెంట్లు, ప్రశంసలు లభిస్తున్నాయి. శేఖర్ మాస్టర్‌తో పోటాపోటీగా వేసిన ఊరమాస్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వీడియోను శ్రీముఖి పోస్టు చేస్తూ.. చాలా క్విక్‌గా ట్రై చేశాం. మా మధ్య కోఆర్డినేషన్ లేకపోయినా.. మేము చాలా ఎంజాయ్ చేశాం అంటూ శ్రీముఖి కామెంట్ చేసింది. యాంకర్ విష్ణు ప్రియ వారి వీడియోను లైక్ కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ వీడియోపై మీరు ఒకసారి లుక్కేయండి...