Don't Miss!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘సొంతం’కు 18 ఏళ్లు.. ఇప్పటికీ ప్రేమ కురిపిస్తున్నందుకు థ్యాంక్స్ : శ్రీనువైట్ల
టాలీవుడ్‌లో ఒకప్పుడు శ్రీనువైట్ల శకం నడిచింది. అలా శ్రీనువైట్ల స్వర్ణయుగపు కాలంలో థియేటర్లలో నవ్వుల పంట పండించాడు. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరులా మారిపోయాడు శ్రీనువైట్ల. శ్రీనువైట్ల కెరీర్‌లో ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య వరుసగా పరాజయాలు ఎదురవుతుండటంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. చివరగా అమర్ అక్బర్ ఆంటోని వంటి సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో 2002 ఆగస్ట్ 23న వచ్చిన సొంతం సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా దేవీ అందించిన పాటలు, సునీల్ ఎంఎస్ నారాయణ కాంబోలో వచ్చిన కామెడీ గురించే మాట్లాడుకునే వారు. ఈ సినిమా తరువాత చాలా మంది ఈ ఫార్మూలాను వాడారు. సునీల్, ఎంఎస్ నారాయణను బాగా వాడుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్‌ను యూట్యూబ్‌లో రిపీటెడ్ మోడ్‌లో చూసే ప్రేక్షకులున్నారు.

సొంతం సినిమా అటు ఆర్యన్ రాజేశ్‌ను హీరోగా నిలబెట్టింది. ఇటు నమితను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలాంటి సొంతం సినిమా విడుదలై నేటికి పద్దెనమిదేళ్లు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల సొంతం సినిమా గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. సొంతం సినిమాకు పద్దెనిమిదేళ్లు.. ఇప్పటికీ ఈ చిత్రంపై ప్రేమను కురిపిస్తోన్నందుకు థ్యాంక్స్.. ఎంఎస్ నారాయణ గారిని మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అయ్యాడు.