For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna No More: సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఇదే.. సినిమాల్లోకి రావడానికి కారణం?

  |

  సూపర్ స్టార్ కృష్ణ.. డ్యాషింగ్ అండ్ డేరింగ్ కు మారుపేరు. సినిమాపై ప్రయోగాలు చేసి జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన సైంటిస్ట్. సినిమా స్కోప్, నార్త్ లో షూటింగ్ వంటి తదితర అంశాలలో ఫస్ట్ ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయనే. సినిమాల్లో ప్రయోగాలు చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇక అల్లూరి సీతరామరాజు అంటే ఎవరైనా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆలాంటి దిగ్గజం నేల రాలింది.

  ఆరు దశాబ్ధాల సినీ శకం ముగిసింది. గుండెపోటుతో సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం నాలుగు గంటలకు మరణించిన విషయం తెలిసిందే. సినీరంగంలో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణకు అసలు పేరు, ఆయన సినిమాల్లోకి రావడానికి గల కారణం ఇదే

   శోకసంద్రంలో సినీ లోకం..

  శోకసంద్రంలో సినీ లోకం..

  తెలుగు సినిమా పరిశ్రమలో సుమారు ఆరు దశాబ్దాలపాటు విభిన్నమైన పాత్రలు, విలక్షణ నటనతో నిర్మాతగా, దర్శకుడిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది.

  మూడు వందలకుపైగా చిత్రాల్లో..

  మూడు వందలకుపైగా చిత్రాల్లో..

  సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురైన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సుమారు మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తనదైన శైలీలో చెరగని ముద్ర వేసుకున్నారు. జేమ్స్ బాండ్ గా, కౌ బాయ్ గా నటించి నటశేఖరుడు అనిపించుకున్నారు.

  కొత్త పంథాలో సినిమాలు..

  కొత్త పంథాలో సినిమాలు..

  సాహస చిత్రాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. హీరోగానే కాకుండా నిర్మాతగా భారీ, వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఆయన డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. అందులో కొన్ని ఆయన కుమారుడు నట వారసుడు మహేశ్ బాబుతో కలిసి నటించినవి కూడా ఉన్నాయి. తెలుగు సినిమా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగు వెండి తెరపై కొత్త పంథాలో కథలను చూపించారు.

  ఘట్టమనేని కృష్ణగా మార్పు..

  ఘట్టమనేని కృష్ణగా మార్పు..

  అయితే సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. సినిమాల్లోకి వచ్చాక ఆయన ఘట్టమనేని కృష్ణగా పేరు మార్చుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం 1942, మే 31న జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ. బాల్యం అంతా తల్లిదండ్రులు ఘట్టమనేని వీర రాఘవయ్య, నాగరత్న వద్ద గడిచింది. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజ్ లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు.

  తేనె మనసులు చిత్రంతో హీరోగా..

  తేనె మనసులు చిత్రంతో హీరోగా..

  సూపర్ స్టార్ కృష్ణ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న కొంత కాలానికే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో పాత్రల్లో మెరిశారు. ఆ తర్వాత తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. 1964 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా తర్వాత మూడో చిత్రంగా గూఢచారి 116 సినిమాతో మంచి హిట్ కొట్టారు.

  English summary
  Superstar Krishna Passed Away: Krishna Original Name Is Ghattamaneni Siva Rama Krishna Murthy And Behind Reason Of His Entry In Movies
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X