twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి మాటలు విన్నప్పుడు రక్తం మరుగుతుంది.. ఆ వ్యాఖ్యలపై రేణూ దేశాయ్ ఫైర్

    |

    ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనలో అమ్మాయి శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు చేశారు. అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం ఈ ఘటనపై గొంతెత్తుతున్నారు.

    సెలెబ్రిటీల స్పందన..

    సెలెబ్రిటీల స్పందన..

    హథ్రస్ ఘటనపై న్యాయం జరగాలని, అమ్మాయి కుటుంబానికి అండగా నిలబడాలని సెలెబ్రిటీలందరూ ముందుకు వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అందరూ హథ్రస్ ఘటనపై స్పందించారు. ఇక ఇలాంటి అన్యాయాలపై తన గళాన్ని అందరికి వినిపించేందుకు రేణూ దేశాయ్ ముందుంటుందన్న సంగతి తెలిసిందే.

    చట్టాలు, న్యాయాలు..

    చట్టాలు, న్యాయాలు..

    హథ్రస్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత రేణూ దేశాయ్ స్పందిస్తూ.. మీడియా, రాజకీయ నాయకులపై ఫైర్ అయింది. గత రెండు నెలలుగా డ్రగ్స్ కేసు గురించిపదే పదే ప్రసారం చేసే మీడియాకు ఈ ఘటన గురించి చర్చించేందుకు సమయం దొరకలేదా? అంటూ సెటైర్ వేసింది.

     తాజాగా ఆ వ్యాఖ్యలపైన..

    తాజాగా ఆ వ్యాఖ్యలపైన..

    యూపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ హథ్రస్ ఘటనపై స్పందిస్తూ..ఇంట్లో తల్లిదండ్రులు కూతుళ్లకు సంస్కారం నేర్పనందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి ఘటనలను శిక్షలు, కత్తులు, ప్రభుత్వాలు ఏం చేయవు.. ఇంట్లో సంస్కారం నేర్పాలి అని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
    రక్తం మరుగుతుంది..

    రక్తం మరుగుతుంది..

    అత్యాచార ఘటనలకు మహిళలే కారణమని ఎవరైనా అంటే తన రక్తం మరుగుతుందని రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఏడాది శివువు, ఆరు నెలల పసికందు రేప్‌కు గురైతే ఆ సంస్కారం ఎలా నేర్పాలి ఎవరికి నేర్పాలి.. మగవారికి ముందుగా సంస్కారం నేర్పాలి..అప్పుడు గానీ ఒక్క రేప్ కూడా జరగదు అని రేణూ దేశాయ్ ఫైర్ అయింది.

    English summary
    Surendra Singh ABout Hathras incident Renu Desai fire, Renu desai Fires On It's the duty of all mothers and fathers to imbibe good values in their daughters and bring them up in cultured environments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X