twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆలీ హీరోగా యమలీల మ్యాజిక్‌కు 25 ఏళ్లు.. విమర్శకుల నోళ్లకు తాళం వేసిన..

    |

    కమెడియన్‌గా బ్రహ్మండంగా రాణిస్తున్న అలీని హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించిన 'యమలీల' చిత్రం ఏప్రిల్ 28 తేదీతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉండడం విశేషం. ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా చేసిన మ్యాజిక్ ఏమిటంటే..

    తల్లిని దేవతలా ఆరాధించే కొడుకులా

    తల్లిని దేవతలా ఆరాధించే కొడుకులా

    తల్లిని దేవతలా ఆరాధించే కొడుకు పాత్రలో అలీ నటన అద్భుతం అని చెప్పాలి. అలాగే తల్లి పాత్రలో మంజుభార్గవి బాగా రాణించారు. సినిమా ఆద్యంతం సెంటిమెంట్ వుంటూనే సందర్భానుసారంగా వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. ఈ సినిమాలోని సెంటిమెంట్‌ ప్రతీ ప్రేక్షకుడిని కదిలించింది.

    మరోసారి యమధర్మ రాజుగా కైకాల

    మరోసారి యమధర్మ రాజుగా కైకాల

    యమగోల తర్వాత మరోసారి యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ కనిపించారు. చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందం, తోట రాముడుగా తనికెళ్ళ భరణి, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కోట శ్రీనివాసరావు, అలీ అసిస్టెంట్‌గా గుండు హనుమంతరావు... ఇలా సినిమాలోని చాలా క్యారెక్టర్స్ ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తాయి. కృష్ణారెడ్డి రూపొందించిన సినిమాల్లో ఇది ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అలీని హీరోగా అంటూ సినిమాకు ముందు కామెంట్లు చేసిన వాళ్ల నోళ్లకు తాళం పడింది.

    పాటలతో ఆలరించిన యమలీల

    పాటలతో ఆలరించిన యమలీల

    యమలీల సినిమాలోని పాటలు కూడా ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలోని ‘సిరులొలికించే చిన్ని నవ్వులే..' పాట సెంటిమెంటల్‌గా ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకుంటుంది. సిరివెన్నెల సీతారావుశాస్త్రి సాహిత్యం, ఎస్.వి.కృష్ణారెడ్డి అందించిన సంగీతం, చిత్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. అలీ, ఇంద్రజ మధ్య వచ్చే ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లోడో..' పాట మాస్ ఆడియన్స్‌చేత స్టెప్పులు వేయించింది.

    మెరుపు పాటలో సూపర్‌స్టార్ కృష్ణ

    మెరుపు పాటలో సూపర్‌స్టార్ కృష్ణ

    యమలీల సినిమాకి మరో ప్రత్యేకత ఏమిటంటే సూపర్‌స్టార్ కృష్ణ ఓ మెరుపు పాటలో కనిపించడమే. ‘జూంబారే జుజుంబరే..' పాట సినిమాకి పెద్ద హైలెట్ అయింది. ఈ పాటలో ఇంద్రజతో కలిసి సూపర్‌స్టార్ కృష్ణ వేసిన స్టెప్స్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఒక చిన్న హీరోతో ఎస్.వి.కృష్ణారెడ్డి రూపొందించిన 'యమలీల' కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ప్రదర్శింపబడింది. విడుదలై 25 సంవత్సరాలుపూర్తవుతున్నా ఇప్పటికీ 'యమలీల' చిత్రానికి ప్రేక్షకుల ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

    English summary
    Director SV Krishna Reddy's Yama Leela completed 25 years. Comedian Ali turned as hero with this movie. Indraja, Manju Bharghavi is the lead actresses. This movie collected huge money with great success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X