For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండియా జెర్సీలో వరల్డ్ కప్‌తో పవన్: అన్‌సీన్ ఫొటోను షేర్ చేసిన థమన్.. దీని వెనుక అసలు కథ ఇదే

  |

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే చాలా తక్కువ సినిమాలతోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. తద్వారా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా దక్కించుకున్నాడు. అలా దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నాడు. ఇక, రీఎంట్రీలో మరింత సత్తా చాటుతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. పవన్ కల్యాణ్ అన్‌సీన్ ఫొటోను షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  అప్పటి వరకూ ఓ లెక్క.. రీఎంట్రీలో

  అప్పటి వరకూ ఓ లెక్క.. రీఎంట్రీలో

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను అందుకుంటూ దూసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అతడు రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు. ఇక, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి జోష్‌లో కనిపిస్తున్నాడు.

  హిట్ అయినా నిరాశనే మిగిల్చింది

  హిట్ అయినా నిరాశనే మిగిల్చింది

  ‘వకీల్ సాబ్' అనే సినిమా ద్వారానే పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించగా.. దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో మొదటి ఆట నుంచే హిట్ టాక్ దక్కింది. అయితే, ఆ తర్వాత అనుకోని పరిస్థితులు రావడంతో కలెక్షన్ల పరంగా నిర్మాతకు నష్టాలే మిగిలాయి.

  ఇంకో స్థాయికి తీసుకెళ్లిపోయాడుగా

  ఇంకో స్థాయికి తీసుకెళ్లిపోయాడుగా

  ‘వకీల్ సాబ్' మూవీ గురించి మాట్లాడుకుంటే.. హీరో పవన్ కల్యాణ్ తర్వాత అందరూ చెప్పుకున్నది మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పనితీరు గురించే. ఈ సినిమాకు అతడి అందించిన సంగీతం హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్, మగువా మగువా సాంగ్ అల్టిమేట్ అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే తన సంగీతంతో థమన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిపోయాడు.

   థమన్‌తో పవన్ బంధం బలమైంది

  థమన్‌తో పవన్ బంధం బలమైంది

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్'లో థమన్ అందించిన సంగీతానికి మంచి మార్కులే వచ్చాయి. దీనిపై పవన్ కల్యాణ్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ కారణంగానే అతడికి మరో అవకాశం కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ‘అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌కు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య బంధం బలపడిపోయింది.

  పవన్ అన్‌సీన్ ఫోటోను షేర్ చేస్తూ

  పవన్ అన్‌సీన్ ఫోటోను షేర్ చేస్తూ

  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ‘వకీల్ సాబ్' మూవీ వల్ల అతడు పవన్ కల్యాణ్‌కు భక్తుడు అయిపోయాడు. దీంతో తరచూ పవర్ స్టార్ గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌లో మజాను నింపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒకప్పటి పవన్ కల్యాణ్ అన్‌సీన్ పిక్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు థమన్.

  వరల్డ్ కప్‌తో పవన్ కల్యాణ్ ఫొటో

  వరల్డ్ కప్‌తో పవన్ కల్యాణ్ ఫొటో

  తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ షేర్ చేసిన ఫొటోలో పవన్ కల్యాణ్ టీమిండియా క్రికెట్ జెర్సీ వేసుకుని ఉన్నాడు. అంతేకాదు, వరల్డ్ కప్‌ను ముద్దాడుతున్నాడు. ఈ పిక్‌కు ‘వావ్.. ప్రపంచ కప్‌తో మన లీడర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు. ఈరోజు ఈ పిక్ నాలో మరింత ఎనర్జీని అందించింది' అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు. ఇక, ఈ ఫోటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

  ఆ ఫొటో వెనుక అసలు కథ ఏంటి?

  ఆ ఫొటో వెనుక అసలు కథ ఏంటి?

  2003లో క్రికెట్ ప్రపంచ కప్ జరిగింది. దీనికి పెప్సీ వ్యాపార భాగస్వామిగా వ్యవహరించింది. అప్పుడు ఈ బ్రాండ్‌కు పవన్ కల్యాణ్ అంబాసీడర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ అన్ని దేశాల్లోనూ తిరుగుతూ హైదరాబాద్ చేరుకుంది. ఆ సమయంలోనే పెప్సీ సంస్థ తరపున ఈ కార్యక్రమానికి హాజరైన పవన్.. టీమిండియా జెర్సీతో ప్రపంచ కప్‌ను ముద్దాడుతూ ఫొటో దిగాడు.

  English summary
  Young Music Sensation S Thaman Very Active in Social Media. Now He Shared Pawan Kalyan Old Unseen Pic. In This Photo Thsi Star Hero Kissed Cricket World Cup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X