2022 Weddings: 2022లో వివాహం చేసుకున్న హీరో హీరోయిన్లు వీళ్లే.. పెళ్లైన 7వ నెలకే తల్లైన హీరోయిన్

సాధారణంగా సినీ పరిశ్రమలోని సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్‌లకు సంబంధించిన విషయాలు అంటే అందరికీ మక్కువ ఎక్కువే అని చెప్పాలి. అందుకే మిగిలిన రంగాలతో పోలిస్తే ఇందులోనే ఎక్కువగా వాళ్ల వాళ్ల లవ్ లైఫ్‌లు, వైవాహిక బంధాల గురించి తెలుసుకోడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు చాలా మంది హీరోలు, హీరోయిన్లు ప్రేమాయణం సాగిస్తూ వస్తున్నారు. అందులో కొందరు మాత్రం ఈ ఏడాది వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అలా 2022లో పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్ల గురించి ప్రత్యేకమైన కథనం మీ అందరి కోసం!

ప్రియుడితో మౌనీ రాయ్ పెళ్లి

ప్రియుడితో మౌనీ రాయ్ పెళ్లి


ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియళ్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోన్న 'నాగిన్' ఫేం మౌనీ రాయ్.. కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలాగే, అతడిని ఈ ఏడాది జనవరి 27వ తేదీన పెళ్లాడింది. వివాహం జరిగిన తర్వాతనే పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'లో విలన్‌గా నటించింది. ఈ చిత్రంతో ఆమె రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

దుబాయ్ షేక్‌తో పూర్ణ వివాహం

దుబాయ్ షేక్‌తో పూర్ణ వివాహం

టాలీవుడ్‌లో బిజీగా గడుపుతోన్న పూర్ణ అలియాస్ సామ్నా కాశీం.. దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన తర్వాత వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 25వ తేదీన వీళ్లిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో అరబిక్ పద్దతిలో వివాహం చేసుకున్నారు.

అగ్నిసాక్షిగా ఒక్కటైన జంట

అగ్నిసాక్షిగా ఒక్కటైన జంట

కోలీవుడ్‌ యంగ్ హీరో ఆది పినిశెట్టి, కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీ చాలా కాలంగా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ఈ ఏడాది మార్చి 24న ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లు మే 18వ తేదీన వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని, సందీప్‌ కిషన్‌లు, ఆర్య సహా ఎంతో మంది హాజరయ్యారు.

దర్శకుడితో నయనతార పెళ్లి

దర్శకుడితో నయనతార పెళ్లి

చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన నయనతార.. విఘ్నేష్ శివన్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్‌‌‌లో పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వర్క్ జరిగింది. దీంతో ఈ సినీ జంట పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ప్రియురాలితో నాగశౌర్య పెళ్లి

ప్రియురాలితో నాగశౌర్య పెళ్లి

తన గర్ల్‌ఫ్రెండ్ అనూష శెట్టిని హీరో నాగశౌర్య నవంబర్ 20వ తేదీన వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వేడుకలో ఆమె మెడలో మూడుముళ్లు వేసేశాడు. ఎంతో సందడిగా సాగిన ఈ పెళ్లిలో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇది బెంగళూరులోని ఓ హోటల్‌లో నిరాడంబరంగానే జరిగింది.

పెళ్లి చేసుకున్న సినీ జంట

పెళ్లి చేసుకున్న సినీ జంట

మలయాళ భామ మంజిమ మోహన్, కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ 'దేవరట్టం' మూవీలో జంటగా నటించారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంజిమ మోహన్, గౌతమ్ కార్తీక్‌లు నవంబర్ 28వ తేదీన చెన్నైలోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. దీంతో వీళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఆలియా - రణ్‌బీర్.. తల్లైంది

ఆలియా - రణ్‌బీర్.. తల్లైంది

బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్ 14వ తేదీని వీళ్లిద్దరూ పెద్దల సమక్ష్యంలో అగ్నిసాక్షిగా ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహం తర్వాత తమ వైవాహిక జీవితాన్ని చక్కగా గడిపిన ఆలియా - రణ్‌బీర్.. ఏడాది తిరగకముందే నవంబర్ 6వ తేదీన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

హన్సికతో పాటు వాళ్ల పెళ్లిళ్లు

హన్సికతో పాటు వాళ్ల పెళ్లిళ్లు

దక్షిణ భారతదేశంలోని భాషలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ హన్సిక మోత్వానీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె డిసెంబర్ 4న ప్రియుడు సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ఆమెతో పాటు ఈ ఏడాదిలో మరికొందరు బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలను మొదలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X