For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ugadi wishes posters: ఉగాది జోష్ పెంచిన RRR, విరాటపర్వం.. న్యూలుక్స్‌తో అదరగొట్టిన నారప్ప, సన్నాఫ్ ఇండియా

  |

  ఉగాది సందర్భంగా కొత్త సినిమాల హడావుడి మొదలైంది. కరోనా కారణంగా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నప్పటికి సినిమా అప్డేట్స్ మాత్రం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద సినిమాల తాకిడికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక ఉగాది సందర్భంగా రాధేశ్యామ్, RRR, విరాటపర్వం, ఖిలాడి , F3 సినిమాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒకసారి వాటిపై ఒక లుక్కేస్తే..

  RRR స్పెషల్ పోస్టర్

  RRR స్పెషల్ పోస్టర్

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్కును విడుదల చేశారు. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోస్టర్ లో ఇద్దరిని జనాలు పైకి ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నట్లు ఉండడం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అక్టోబర్ 13న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

  సాయి పల్లవి 'విరాటపర్వం'

  సాయి పల్లవి 'విరాటపర్వం'

  సాయి పల్లవి రానా మొదటిసారి కలిసి నటించిన ఇంట్రెస్టింగ్ మూవీ విరాటపర్వం. ఈ సినిమా ప్రతి పోస్టర్ కూడా ఆడియెన్స్ లో తెలియని ఆసక్తిని కలిగిస్తోంది. ఉగాది సందర్భంగా సాయి పల్లవికి సంబంధించిన మరో ట్రెడిషినల్ పోస్టర్ ను వదిలారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ కరోనా కారణంగా ఆ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  ప్రభాస్ లవ్లీ లుక్

  ప్రభాస్ లవ్లీ లుక్

  రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తరువాత యాక్షన్ ఫార్మాట్ ను పక్కనపెట్టి సరికొత్త ప్రేమ కథతో రాబోతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఈ ఉదయమే విడుదల చేశారు. విక్రమాదిత్య లుక్కుతో ప్రభాస్ క్లాస్ గా దర్శనమిచ్చాడు. జూలై30న సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

   నారప్ప ఉగాది స్పెషల్

  నారప్ప ఉగాది స్పెషల్

  హ్యాపీ ఉగాది అంటూ నారప్ప పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కోలీవుడ్ హిట్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ప్రియమణి నటించింది. ఇక శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది.

  F3 న్యూ షెడ్యూల్..

  F3 న్యూ షెడ్యూల్..

  వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న మరో మల్టీస్టారర్ మూవీ F3. ఇక ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ ను వదిలారు. న్యూ షెడ్యూల్ మొదలైనట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు తుది దశకు చేరినట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 27న రానుంది.

  గోపీచంద్ సీటీమార్

  గోపీచంద్ సీటీమార్

  గోపీచంద్ - తమన్నా భాటియా నటించిన స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ లేటెస్ట్ పోస్టర్ కూడా వైరల్ గా మారింది. కబడ్డీ గేమ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను కమర్షియల్ దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు.

  మోహన్ బాబు న్యూ లుక్

  మోహన్ బాబు న్యూ లుక్

  చాలా కాలం తరువాత మోహన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఉగాది సందర్భంగా న్యూ పోస్టర్ ను విడుదల చేయగా అందులో మోహన్ బాబు నెవర్ బిఫోర్ అనే లుక్కుతో దర్శనమిచ్చారు. ప్రముఖ రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తుండగా ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

  నీలంబారితో సిద్దా

  నీలంబారితో సిద్దా

  మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఆచార్య. ఉగాది సందర్భంగా సినిమాకు సంబంధించిన న్యూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ విషెస్ అందిస్తూ పూజాహెగ్డేతో ఉన్న స్పెషల్ లుక్కును విడుదల చేశారు. ఇందులో సిద్దా పాత్రకు జోడిగా పూజ నీలాంబరి అనే పాత్రలో నటిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

  English summary
  The rush of new movies started during Ugadi. Though the release dates have been postponed due to Corona, the movie updates are still impressing the fans. It can be said that new records will be created at the box office in the coming days for the onslaught of big movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X