Don't Miss!
- News
కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి... మిగతా ఉద్యోగుల్లో భయాందోళన...
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Automobiles
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చాలా రోజుల తరువాత ఇలా.. ఎమోషనల్‌గా టచ్ చేసిన ఉదయభాను
ఒకప్పుడు ఉదయ భానుకి బుల్లితెరపై వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి.. అంతగా హైలెట్ అవ్వలేదు. కానీ వెండితెరపై, బుల్లితెరపై ఉదయ భాను సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వివాదాలతోనూ ఉదయ భాను నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చేది. ఇక బుల్లితెరపై ఉదయ భాను షోను హోస్ట్ చేస్తోందంటే అది కచ్చితంగా హిట్ అని అందరూ అనుకునేవారు.

బుల్లితెరపై అలా..
వన్స్ మోర్ ప్లీజ్,డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారేలారే ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను ఉదయ భాను నడిపించింది. ఇక ఢీ వంటి డ్యాన్స్ షోను తనదైన శైలిలో నడిపించింది. అలా ఉదయ భాను చేసే ప్రతీ షో ఓ బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వచ్చింది. బుల్లితెర క్రేజ్‌ను వెండితెరపై ఉదయ భాను బాగానే వెలిగింది.

వెండితెరపై రచ్చ..
వెండితెరపై ఉదయభాను చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. స్పెషల్ క్యారెక్టర్స్, హీరోయిన్, నెగెటివ్ రోల్స్ ఇలా ప్రతీ ఒక్క పాత్రను ఉదయభాను తనదైన శైలిలో పండించింది. ఇక సినిమాల్లో ఐటం సాంగ్స్‌తో ఉదయభాను దుమ్ములేపేసింది. అయితే ఈ మధ్య మాత్రం ఉదయ భాను అంతగా కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో మాత్రం..
తెరపై ఉదయ భాను కనిపించకపోయినా కూడా.. సోషల్ మీడియాలో మాత్రం తన గళం విప్పుతూనే ఉంటుంది. అవసరమైన ప్రతీ సందర్భంలో ఉదయ భాను తన అభిప్రాయాలను చెబుతూ వస్తోంది. ఎస్పీబీ మరణం, ఎన్నికలు, సమాజంలోని అఘాయిత్యాలు వంటి వాటిపై ఉదయ భాను స్పందిస్తూ వచ్చింది.

తాజాగా అలా
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా.. జీ తెలుగులో ఓ స్పెషల్ షో రాబోతోంది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అనే ప్రోగ్రాంను చేస్తున్నారు. ఇందులో మహిళలను గౌరవిస్తూ సన్మానం చేశారు.ఈ ప్రోగ్రాంలో ఉదయ భాను గెస్ట్‌గా వచ్చింది.

గౌరవించాలి..
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అనే ఈ ప్రోగ్రాంలో ఉదయ భాను మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ మేరకు వదిలిన ప్రోమో బాగానే వైరల్ అవుతోంది. ఈ ప్లానెట్‌కు చెట్టు ఎంత అవసరమో.. మహిళను గౌరవించడం కూడా అంతే అవసరం అంటూ ఉదయ భాను అందరినీ టచ్ చేసింది.ఈ ప్రోగ్రాంలో జీవితా రాజశేఖర్ కూడా పాల్గొంది.