twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు నేర్పించింది అదే.. నా జీవితానికి వారే గురువులు.. ఉపాసన కామెంట్స్

    |

    దేశంలో అపోలో అనే పదం వినని వారెవ్వరూ ఉండరు. అపోలో హాస్పిటల్స్ దేశ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచినవి. అంతటి గొప్ప సంస్థలో ఉపాసన ఓ బృహత్తరమైన బాధ్యతను నిర్వర్తిస్తోంది. నేటి గురు పౌర్ణిమను పురస్కరించుకుని, తన జీవితంలో గురువు గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన బాధ్యతలు, అపోలో గ్రూప్స్ విశిష్టతలను అందరికీ వివరించింది. ఇంతకీ ఉపాసన చెప్పిన విశేషాలేంటో ఓసారి చూద్దాం.

    రెండింటిని బ్యాలెన్స్..

    రెండింటిని బ్యాలెన్స్..

    ఉపాసన అటు మెగా ఫ్యామిలీ బాధ్యతలను, ఇటు అపోలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తనకు తోచిన చిట్కాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలను వివరిస్తూ ఉంటుంది.

    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

    ఉపాసనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. రామ్ చరణ్ గురించిన వివరాలే కాకుండా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్లకు సంబంధిచిన అప్‌డేట్స్ సైతం ఇస్తూ ఉంటుంది. ఆయుర్వేద చిట్కాలు, వంటల చిట్కాలు, ప్రాచీన పద్దతుల్లో ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధానాన్ని వివరిస్తూ ఉంటుంది.

    లాక్ డౌన్‌లో బిజీగా..

    లాక్ డౌన్‌లో బిజీగా..

    లాక్ డౌన్ సమయంలో ఉపాసన ఫుల్ బిజీగా ఉంది. అవసరమైన వారికి నిత్యావసర సరుకులు అందిస్తూ, మరోవైపు ఇలా ఖాళీగా దొరికిన ఈ సమయాన్ని సేంద్రియ వ్యవసాయం చేస్తూ ప్రకృతి ఒడిలో సేది తీరుతోంది. తాజాగా గురు పౌర్ణిమ సందర్భంగా తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తుల గురించి, తన సంస్థ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.

    Recommended Video

    Upasana About Northern States People రూపురేఖలు చూసి చైనీస్‌ అంటూ దరిద్రమైన కామెంట్స్ : ఉపాసన ఎమోషనల్
    నేర్పించింది అదే..

    నేర్పించింది అదే..

    ఇది వర్కింగ్ సండే.. మెడికల్‌కు సంబంధించిన వారికి హాలీడేలు ఉండవు.. మీ సేవకై 24/7 అందుబాటులో ఉంటాం. అవసరం, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే ప్రథమ కర్తవ్యమని మా తాత చెప్పేవారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా.. షేర్ హోల్డర్స్ అభిప్రాయాలను గౌరవిస్తూ.. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరిస్తూ.. సరిపడా మెటీరియల్స్, మా సిబ్బందికి తగిన జీతం, సాంకేతికతను వినియోగించడం, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది అవసరాలు వంటి విషయాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో మా గురువు నేర్పించారు.

    వారే నా గురువులు..

    వారే నా గురువులు..

    అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ దేశ వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్నాయి. మా తాత మాటల్లో చెప్పాలంటే.. ‘కొందరు చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజల బాధలను పోగొట్టేందుకు అపోలో కుటుంబం నిర్విరామంగా పని చేస్తూనే ఉంటుంది'. డా ప్రతాప్ రెడ్డి (ఫౌండర్ చైర్మన్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్.) లవ్యూ తాత అమ్మమ్మ. మీరే నా జీవితానికి గురువులు' అని చెప్పకొచ్చింది.

    English summary
    Upasana Konidela About Dr Prathap C Reddy. It’s a working Sunday ! Medical Emergencies have no holiday - we are at UR service 24/7. Thatha’s taught us to put the interest of those in need of help, first
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X