Just In
- 5 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 6 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 7 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 8 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిహారికకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన వరుణ్ తేజ్.. వాళ్లందరినీ తీసుకురావడంతో మెగా డాటర్ ఖుషీ!
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వివాహానికి సమయం దగ్గర పడడంతో బడా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా హీరోలు, కూతుళ్లు, అల్లుళ్లతో నాగబాబు ఇల్లు కోలాహళంగా మారింది. రోజుకో పార్టీతో కజిన్స్ అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కబోయే వధువరులిద్దరూ వాటిలో పాలు పంచుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న తన సోదరి నిహారికకు వరుణ్ తేజ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడట. తమతో కలిసి ఉండే నాలుగు రోజులు సంతోష పెట్టేందుకు అదిరిపోయే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి
తన కుమార్తెకు వివాహం చేయబోతున్నట్లు నాగబాబు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అందుకు అనుగుణంగానే గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మెగా డాటర్ నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలోనే వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు మాత్రమే దీనికి హాజరయ్యారు.

ఆసియాలోనే రెండో పెద్ద ప్యాలెస్‌లో ఫిక్స్
నిహారిక - చైతన్యకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాటు చేశారు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు. ఇందులో భాగంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో వీళ్ల పెళ్లి జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరగబోతుంది.

పెళ్లికి హాజరయ్యే అతిథుల్లో పవర్ స్టార్
అంగరంగ వైభవంగా జరగనున్న నిహారిక - చైతన్యల పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్‌లు వివాహ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక, ఈ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక, పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.

వరుస పార్టీలతో మెగా ఫ్యామిలీ ఎంజాయ్
పెళ్లికి సమయం దగ్గరపడడంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే నిహారిక - చైతన్య కలిసి తమ స్నేహితులకు బ్యాచ్‌లర్ పార్టీలు ఇచ్చేశారు. ఇక, మెగా డాటర్లు అంతా కలిసి ఈ ప్రిన్సెస్‌ను పెళ్లి కూతురిని చేశారు. చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత వాళ్ల భర్తలు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

నిహారికకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన వరుణ్ తేజ్
నాగబాబు కుటుంబంలో జరుగుతోన్న మొదటి పెళ్లి కావడంతో, ఈ వేడుక కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన చెల్లి పెళ్లిని ఎల్లకాలం చెప్పుకునేలా జరిపించాలని భావిస్తున్నాడట. అందుకోసం స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే నిహారికకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది.

వాళ్లందరినీ తీసుకురావడంతో ఫుల్ ఖుషీ!
మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న తన చెల్లెలిని ఖుషీగా ఉంచేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేక ప్లాన్లు వేశాడని సమాచారం. ఇందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుతున్నాడని టాక్. అంతేకాదు, తనకు ఇష్టమైన స్నేహితులు, కజిన్స్‌తో ప్రత్యేకమైన పార్టీలు జరిపాడని అంటున్నారు. తాజాగా వీటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడీ స్టార్ హీరో.