twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్ మెగా విరాళం: పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ సపోర్ట్, కోట్ల రూపాయలు....

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి తను స్థాపించిన 'జనసేన పార్టీ' కార్యకలాపాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. పార్టీని నడిపించడం కోసం తను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చుపెడుతున్నారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

    పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అనేక మంది అభిమానులు ఇప్పటికే అండగా నిలవగా..... ఆయన కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తన కుమారుడి పార్టీకి అంజనీదేవి కొన్ని రోజుల క్రితం తనవంతు సహాయంగా విరాళం అందించగా, ఇతర కుటుంబ సభ్యులు తమ వంతు సహాయం అందిస్తున్నారు.

     వరుణ్ తేజ్ మెగా విరాళం

    వరుణ్ తేజ్ మెగా విరాళం

    తాజాగా నాగబాబు తనయుడు, టాలీవుడ్ స్టార్ వరుణ్ తేజ్ రూ. 1 కోటి విరాళం అందించి ఆశ్చర్యపరిచారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇంత పెద్ద మొత్తం విరాళం జనసేన పార్టీకి వెళ్లడం ఇదే తొలిసారి.

     తమ్ముడి పార్టీకి తనవంతు సహాయంగా...

    తమ్ముడి పార్టీకి తనవంతు సహాయంగా...

    తమ్ముడి మీద అమితమైన అభిమానం చూపించి మెగా బ్రదర్ నాగబాబు... జనసేన పార్టీ కోసం రూ. 25 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

     గతంలో నాగబాబును ఆదుకున్న పవన్ కళ్యాణ్

    గతంలో నాగబాబును ఆదుకున్న పవన్ కళ్యాణ్

    గతంలో సినిమా నిర్మాణంలో తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య ఆలోచన చేసిన అన్నయ్య నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేసి ఆదుకున్నారు. ఈ విషయాన్ని నాగబాబు గతంలో పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

     మెగా ఫ్యామిలీ నుంచి భారీ విరాళాలు

    మెగా ఫ్యామిలీ నుంచి భారీ విరాళాలు

    ఇతర మెగా ఫ్యామిలీ హీరోల నుంచి సైతం ‘జనసేన పార్టీ'కి కోట్లలో విరాళాలు అందుతాయని భావిస్తున్నారు. మరో వైపు మెగా అభిమానులు సైతం జనసేన పార్టీకి తమవంతు సహాయంగా విరాళం అందిస్తున్నారు.

    తన వద్ద డబ్బు లేదన్న పవన్ కళ్యాణ్

    తన వద్ద డబ్బు లేదన్న పవన్ కళ్యాణ్

    కాంట్రాక్టులు, సెటిల్మెంట్స్, అక్రమ దందాలు చేయడం తనకు తెలియదని, తన జీవనాధారం సినిమాలు మాత్రమే అని, ఇపుడు అవి కూడా మానేసినట్లు తెలిపిన పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ' కేవలం ప్రజలు ఇచ్చే విరాళాల మీదనే ఆధారపడి నడుస్తుందని పలు సందర్భాల్లో వెల్లడించారు.

    English summary
    Mega brother Naga Babu and his son Varun Tej have donated Rs 25 Lakh and Rs 1 crore respectively for Jana Sena Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X