ఇంద్ర భవనం లాంటి ఇంటిలోకి యష్.. భార్య సంప్రదాయ పూజలు.. నూతన గృహం ఖరీదెంతంటే!
కన్నడ సూపర్‌స్టార్, రాకింగ్ స్టార్ యష్ నూతన ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి కొత్త ఇంటిలోకి సతీసమేతంగా అడుగుపెట్టారు. విలాసవంతంగా ఇంధ్రభవనాన్ని తలపించే ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

బెంగళూరులోని ఖరీదైన ప్రాంతంలో
KGF చిత్రంతో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకొన్న యష్, నటి రాధిక పండిట్ దంపతులు మరో కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్‌ను ఇటీవలే యష్ కొనుగోలు చేశారు. ఖరీదైన వైట్ మార్బుల్, వుడ్ ఫర్నిష్‌తో ఉన్న ఇంటిని రూ.4 కోట్లకుపైగానే వెచ్చించి కొనుగోలు చేసినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నారు.

జూలై 1వ తేదీన గృహ ప్రవేశం
యష్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూలై 1వ తేదీ గురువారం గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన ఇంటిలోకి తల్లి, భార్య, పిల్లలతో కలిసి పూజలు నిర్వహించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.

భార్య, తల్లితో కలిసి పూజలు
నూతన గృహ ప్రవేశం సందర్భంగా తీసిన యష్ ఫ్యామిలీ ఫోటోలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. భార్య రాధిక పండిట్‌తో కలిసి యష్ చేసి పూజ కార్యక్రమాలు, అలాగే కుటుంబంతో కలిసి ఆనందోత్సవాల మధ్య ఉన్న క్షణాలు అభిమానులను ఆకట్టుకొంటున్నాయి. ప్రస్తుతం నూతన ఇంటిలోకి కుటుంబంతో సహా చేరారు.

పంచెకట్టు.. పోని టెయిల్ జుట్టుతో క్రేజీగా
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలో యష్ లుక్ వైరల్‌గా మారింది. పంచ కట్టుతో బంగారు కలర్ సిల్క్ షర్ట్‌లో పోనీ టెయిల్ జుట్టుతో యష్ ట్రెండీగా కనిపించారు. భార్యతో కలిసి చేతిలో హరతి, దేవుడు పటాల ముందు ఇద్దరు అన్యోన్యయంగా కనిపించారు. తల్లితో కలిసి ఇంటిలో పూజలు నిర్వహించారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా
పూజ సందర్భంగా అందంగా ముస్తాబు చేసిన పూజా మందిరం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. మామిడి, అరటి ఆకులు, పూలదండలు, పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమం మరింత సంప్రదాయంగా జరిగినట్టు కనిపించింది. సంప్రదాయలు పాటించిన యష్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. హిందూ ఆచారాలను తూచ తప్పకుండా పాటించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











