»   » రజనీ పుట్టినరోజున కానుకగా కమల్, శ్రీదేవి చిత్రం

రజనీ పుట్టినరోజున కానుకగా కమల్, శ్రీదేవి చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రేక్షకులకు రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా రజనీ తొలినాళ్లలో నటించిన '16 వయదినిలే'ను విడుదల చేయనున్నారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చి అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాలో కమల్‌హాసన్‌, శ్రీదేవి కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిజిటలైజేషన్‌ చేసి 12న తెరపైకి తీసుకురానున్నారు. ఇందులో రజనీకాంత్‌ నటించిన 'పరట్టె' పాత్ర.. ఆ పాత్ర పలికే 'ఇదు ఎప్పడి ఇరుక్కు' డైలాగు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక కమల్‌హాసన్‌ నటన ప్రత్యేకంగా నిలిచింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదుపరి చిత్రం 'కోచ్చడయాన్‌' కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పుట్టినరోజైన డిసెంబరు 12న ఇది విడుదలవుతుందని అనుకున్నారు. ఆరోజున మాత్రం ఆడియో మాత్రమే రానుంది. సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని దింపుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.

'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
Though the release of superstar Rajinikanth’s Kochadaiiyaan has been postponed to release on Pongal in January, Rajini’s fans would still have something to cheer for on the star’s birthday this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu