తమిళ టీఆర్పీల రికార్డులను షేక్ చేసిన నరసింహ.. డాక్టర్ సినిమాతో పోటీగా!
పెద్ద సినిమాలు సహా చిన్న సినిమాలు అన్నీ థియేటర్లలో విడుదలయ్యాక మళ్ళీ చానల్స్ లో కూడా టెలికాస్ట్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి పరిస్థితుల్లో శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాలకు పెద్ద రేటింగ్ రావడమే గగనం అయిపోతుంది. కానీ 22 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాకు లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మించిన రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవును నిజమే. ఈ ఫీట్ ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల సన్ టీవీలో నరసింహ తమిళ వెర్షన్ పడియప్పా టెలికాస్ట్ చేశారు. ఇందులో విశేషం ఏముంటుంది ? అనుకుంటున్నారా అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ఏడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత అక్కడి ఛానల్ లో ప్రీమియర్ అయ్యింది.
అదే రోజు సాయంత్రం ఇండియా న్యూజిలాండ్ ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ కూడా టెలీకాస్ట్ ఇంకేం పడయప్పాను ఎవరు చూస్తారనుకుని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను పూర్తి తలకిందులు చేస్తూ సంచలనాలు నమోదు చేసింది ఆ సినిమా. బార్క్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 17.75 టిఆర్పి సాధించింది పడయప్పా సినిమా. యాడ్స్ తో కలిపి సుమారు మూడున్నర గంటలకు పైగా సాగిన టెలికాస్ట్ ని అంత ఓపిగ్గా చూశారంటే ఈ సినిమాను అక్కడి వారు ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఒక రకంగా ఇది నెల క్రితం థియేటర్లలో రిలీజైన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ డాక్టర్ టెలీకాస్ట్ అయినప్పుడు కూడా ఇంచుమించు ఇదే ఫిగర్ నమోదు కావడం గమనార్హం. ఓటిటి, యూట్యూబ్, పైరసీ సైట్లు ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా రజిని సినిమాను ఇలా టీవీలలో చూడడం అనేది మామూలు విషయం కాదు కదా. ప్రసారమవుతున్న రోజు కూడా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. చూస్తుండగా తీసిన ఫోటోలు వీడియోలు చక్కర్లు కొట్టడం రజనీ క్రేజ్ కు అర్ధం పడుతోంది. పడయప్పా చివరిసారిగా టీవీలో వచ్చింది 2014లో. తర్వాత రాలేదు. తెలుగులో రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది కానీ తమిళంలో మాత్రం ఎందుకో వేయలేదు.


Click it and Unblock the Notifications











