»   » పైరసీకి వ్యతిరేకంగా ‘రెమో’ నిర్మాతల సరికొత్త ప్లాన్

పైరసీకి వ్యతిరేకంగా ‘రెమో’ నిర్మాతల సరికొత్త ప్లాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళ సినిమాల పైరసీ కారణంగా ఈ మధ్య కాలంలో భారీగా నష్టపోతున్న నేపథ్యంలో 'రెమో' చిత్రం పైరసీ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సరికొత్త వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నారు.

24 AM Studios and 'Remo' against piracy

తమిళ సినిమాల పైరసీ మొత్తం ఓవర్సీస్‌ మార్కెట్ నుండి జరుగుతుందని తేలడంతో.... ఈ సినిమాను ఓవర్సీస్ లో కాస్త లేటుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తమిళనాడులో రిలీజైన తర్వాతే ఓవర్సీస్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాణ సంస్థ 24 ఎఎం స్టూడియోస్ వారు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేయడం లాంటివి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పైరీసీ చేసి తమిళనాడులో థియేటర్లలో సినిమా రిలీజ్ రోజే మార్కెట్లోకి పైరసీ సీడీలు వస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary
24 AM Studio has tweeted : “As a Policy all our .24AMSTUDIOS's films will release in overseas market only after release in Tamil Nadu.1st step 2 stop leaks #Remo will release one day later n OVERSEAS market, d same day 7th October after the first show starts in Tamil Nadu”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu