For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  9 నిముషాల పాట... 3 కోట్లు ఖర్చు..30 లక్షలు రెమ్యునేషన్

  By Srikanya
  |

  చెన్నై: సాధారణంగా పాటలు మూడు నుంచి ఐదు నిముషాలు ఉంటాయి. అయితే తొమ్మిది నిముషాలు పాటు సాగే పాట ఒకటి రీసెంట్ గా చిత్రీకరిస్తున్నారు. అందుకోసం మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ పాటలో నర్తించేది మరెవరో కాదు...మన తెలుగు హీరోయిన్ ఛార్మి. ఈ స్పెషల్ పాట చిత్రంలో హైలెట్ గా ఉండనుందని చెప్తున్నారు. పూణే దగ్గర లోని ఓ హిల్ ప్రాంతంలో ఈ పాట కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఇంతకీ ఏ చిత్రం కోసం ఈ పాట అంటారా...వివరాల్లోకి వెళితే...

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  హీరో విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న '10 ఎన్రాదుకుల్ల' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఛార్మీ సైన్ చేసింది. రెగ్యులర్ గా వచ్చే అన్ని సినిమాల్లోలా చేసే స్పెషల్ సాంగ్ లా కాకుండా కథలో భాగంగా బాగా నాటకీయంగా ఉండే ఈ ఛార్మీ స్పెషల్ సాంగ్ నిడివి 9 నిమిషాలు. అందుకే ఈ పాత కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఈ చిత్ర టీం పూణే దగ్గర లోని ఓ హిల్ ప్రాంతంలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఆ సెట్ ని సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తున్నారు. ఈ పాట కోసం ఛార్మి కు 30 లక్షలు పే చేస్తున్నట్లు తెలుస్తోంది.

  3 Crores Spent For Charmi's Item Song?

  త్వరలోనే ఈ సాంగ్ ని షూట్ చేయనున్నారు. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సమ్మర్ చివర్లో రానుంది. ఓ కథని జడ్జిమెంట్ చేయటం ఎంత కష్టం...అందులో కోట్ల పెట్టుబడి, కెరీర్ ల మీద గేమ్ గా నడిచే సినిమా నిర్మాణంలో కీలకంగా నడిచే కథ అంటే చాలా చాలా కష్టం. అయితే తన కథని పది క్షణాల్లో హీరో విక్రమ్ ఓకే చేసారని గర్వంగా చెప్తున్నారు విజయ్ మిల్టన్. ఈ చిత్రాన్ని మురగదాస్ నిర్మించటం మరో విశేషం.

  సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన విజయ్‌మిల్టన్‌ 'గోలిసోడా'తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చెన్నైలో సినిమాను తెరకెక్కించి.. భారీఎత్తున కలెక్షన్లు రాబట్టారు. ఏమాత్రం పెద్ద తారాగణం లేకుండా చిన్న పిల్లలతో సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ వూపుతో ఉన్న విజయ్‌మిల్టన్‌ ఇటీవల ఓ కథను విక్రంకు చెప్పి వినిపించారు. కథ చెప్పిన పది క్షణాల్లోనే విక్రం ఓకే చెప్పారట. ఆ కథే ఇప్పుడు '10 ఎండ్రత్తుకుల్ల'గా తెరకెక్కుతోంది.

  విక్రంతో పరిచయం గురించి చెప్తూ... 'గోలిసోడా' చిత్రాన్ని సత్యం థియేటర్‌లో చూసి.. వెంటనే నాకు ఫోన్‌ చేశారు విక్రం. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మరి నాకు ఏదైనా మంచి కథ ఉందా?.. అని ఆ రోజు అడిగారు. నేనస్సలు నమ్మలేకపోయా. తప్పకుండా చెబుతా సార్‌ అన్నా. అలా మా ఇద్దరి సినిమాకు ఆ మాటలే బీజం అని ఆనందంతో వివరించారు.

  3 Crores Spent For Charmi's Item Song?

  విజయ్ మిల్టన్ మాట్లాడుతూ... దర్శకుడు కావాలన్నది నా ఆశ. కానీ చలనచిత్ర కళాశాలలో దర్శకత్వం కోర్సు చదవాలంటే డిగ్రీ తప్పనిసరి. కానీ అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మూడేళ్లు చదివే అవకాశం కూడా లేదు. అందువల్ల ప్లస్‌టూ అర్హతతో ఛాయాగ్రాహకుడిగా చేరా. 1991లో కోర్సు పూర్తయ్యాక శక్తి శరవణన్‌, విన్సెంట్‌ సెల్వా వద్ద చేరా. అలా దాదాపు తొమ్మిది మంది వద్ద సహాయకుడిగా పని నేర్చుకున్నా. ఇప్పటి వరకు 25 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశా. అన్ని సినిమాల్లోనూ దర్శకుడిగా నా ఆలోచన, పరిశీలనా దృష్టి మాత్రం ఉండేది అన్నారు.

  అలాగే...ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నప్పుడు 'కాదల్‌', 'దీపావళి', 'దయా', 'వనయుద్ధం', 'హలో'.. వంటి చిత్రాలు నాకు చాలా పాఠాలు నేర్పాయి. ఎన్నో విషయాలను తెలుసుకున్నా. ఈ సమయంలోనూ ఓవైపు కథలు కూడా రాసుకునేవాడిని. ఏదోఒక రోజు మెగాఫోన్‌ పట్టాలనే తహతహలాడా. నాటి అనుభవం, నా ఆశలతో 'గోలిసోడా'కు దర్శకుడినయ్యా అన్నారు.

  ఇక 'గోలిసోడా' అనుభవం గురించి చెప్తూ... ఖర్చు పెట్టిన సొమ్ము కన్నా 14 రెట్లు లాభం తెచ్చిపెట్టిందీ చిత్రం. తొలిరోజు 140 థియేటర్లలో విడుదలై.. కొన్ని రోజుల తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా మరో 60 థియేటర్లలో కూడా విడుదలైంది. అందులో తారలెవరూ లేదు. 5డీ కెమెరాతో తెరకెక్కించామంతే. మొత్తం ఓ 20 మందితో కథ నడిపాం. అతిపెద్ద అనుభవాన్ని మిగిల్చిన చిత్రం. నా కెరీర్‌ను వూహించని మలుపు తిప్పింది అన్నారు.

  3 Crores Spent For Charmi's Item Song?

  ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'గోలిసోడా' తర్వాత అంతకు మించిన చిత్రం తీయాలన్నది నా కోరిక. అలా '10 ఎండ్రత్తుకుల్ల' అనే కథను సిద్ధం చేసుకున్నా. తొలిసారి ఆ కథ వన్‌లైన్‌ను విక్రంకు ఫోనలో చెప్పా. వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. కథ చెప్పిన వెంటనే.. పదే పది క్షణాల్లో నటిస్తానని ఒప్పుకొని నాలో ఆనందాన్ని నింపారు. అదే వేగంతో చిత్రీకరణ కూడా 90 శాతం పూర్తి చేశాం. క్లెమాక్స్‌, రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సమంత హీరోయిన్ అని చెప్పుకొచ్చారు.

  ఇది కాకుండా ఛార్మీ కొద్ది రోజుల క్రితమే పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ‘జ్యోతి లక్ష్మీ' సినిమా షూటింగ్ మొదలు పెట్టింది. ఇది కాకుండా మంత్ర 2 షూటింగ్ ని దాదాపు పూర్తి చేసింది.

  English summary
  Producers have shelled out a staggering 3 crore budget to shoot a 9 minute song, featuring no one other than Charmme .The movie in discussion is 10 Enradhukulla and it stars one of Tamil cinema's top stars, Vikram and Samantha in the main leads.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X