twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీకాంత్‌కు 45 ఏళ్లు.. అదిరిపోయే సెలెబ్రేషన్స్!

    |

    ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై స్టార్స్‌గా ఎంతమంది వెలిగినా సరే సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉండే క్రేజే వేరు. కర్ణాటకలో పుట్టి మహారాష్ట్ర మూలాలు ఉండి. తమిళ దైవంగా మారి దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. సాధారణ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలున్నాయి. వాటన్నంటిని ఎదుర్కొని నేడు సూపర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నారు.

    అపూర్వారారంగళ్ (15 ఆగస్ట్ 1975)అనే చిత్రంతో రజినీకాంత్ తెరకు పరిచయం అయ్యారు. కే బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. నెగెటివ్ క్యారెక్టర్స్‌ను కూడా కాదనకుండా చేసి స్టార్‌గా ఎదిగాడు. ఇక తనకు మాత్రమే సొంతమైన స్టైల్‌తో కొత్తశకాన్ని ప్రారంభించారు. భాషా, నరసింహా, ముత్తు వంటి చిత్రాలతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు.

     45 Years Of Rajinism CDP Goes Viral

    ఇండియన్ సూపర్ స్టార్‌గా పిలిపించుకున్న మొదటి స్టార్‌గా రజినీకాంత్ చరిత్రలో నిలిచారు. రజినీకాంత్‌కు నటుడిగా (ఆగస్ట్ 15) 45 యేళ్లు నిండుతుండటంతో సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు కోలీవుడ్ సెలెబ్రిటీలందరూ కలిసి కామన్ డీపీని విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకులు పా రంజిత్, లోకేష్ కనకరాజ్, సౌందర్య రజినీకాంత్ వంటివారు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కామన్ డీపీ తెగ వైరల్ అవుతోంది. రజినీ తన తదుపరి చిత్రాలతో అన్నాత్తె, చంద్రముఖి 2 బిజీగా ఉన్నారు.

    English summary
    45 Years Of Rajinism CDP Goes Viral. 5 Decades! 45 Years! An Identity, An Icon of Tamil and Indian Cinema Folded hands Extremely Happy to release our beloved Superstar #Rajinikanth’s #45YearsOfRajinismCDP
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X