twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కడే హీరో...రేసులో ఆ ఏడుగురు డైరక్టర్లు

    By Srikanya
    |

    చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరక్ట్ చేయాలని ప్రతీ డైరక్టర్ కీ ఉంటుంది. అందులోనూ ఆయన ఈ మధ్య సినిమాలు చేయటం స్పీడు తగ్గించటంతో మరీ దర్శకులకు ఇబ్బందిగా మారింది. ఆయన్ను డైరక్ట్ చేయాలనుకునే వారి లిస్ట్ రోజు రోజుకీ పెరుగుతోంది. తమిళంలో స్టార్ డైరక్టర్స్ అందరూ ఆయన్ని డైరక్ట్ చేయాలని కథలు సిద్దం చేసుకున్నారు.

    ఈ రేసులో ... దర్శకుడు శంకర్, ఎఆర్ మురగదాస్, హరి, పి వాసు, కార్తిక్ సుబ్బరాజు, ఎస్ ఎస్ రాజమౌళి ఉన్నారు. అయితే వీరిలో ఎవరితో రజనీకాంత్ ముందుకు వెళ్తారనేది ప్రశ్నగా మారింది. ఎవరికి వారే తాము చెప్పిన కథని రజనీకాంత్ ఓకే చేస్తారని భావిస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మరోసారి ...రజనీ సినిమాకు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఇటీవల మురుగదాస్‌ ద్విపాత్రాభినయ చిత్ర కథను రజనీకాంత్‌కు వినిపించినట్లు సమాచారం. ఆ కథ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారట రజనీ. త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించనున్నారు.

    7 directors in the race to direct Rajini

    ఇదిలా ఉండగా 'లింగ' కేసుల పరంపర కొనసాగుతోంది.

    రీసెంట్ గా 'లింగ' నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, నటుడు రజనీకాంత్‌పై క్రిమినల్‌కేసు నమోదు చేసేలా పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ సినిమా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.21 కోట్లు గండి పడిందని అందులో ఆరోపించారు.

    మానినా పిక్చర్స్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ ఆర్‌.సింగారవడివేలన్‌ ఈ వ్యాజ్యం వేశారు. తమిళం, తమిళాషాభివృద్ధి సంబంధిత శీర్షికలకు మాత్రమే వినోదపు పన్ను మినహాయింపు ఉందని గుర్తుచేశారు. 'లింగ' సంస్కృత పదమని పేర్కొన్నారు. రజనీకాంత్‌ పలుకుబడితోనే పన్ను మినహాయింపు ఇచ్చారని ఆరోపించారు.

    దీనిపై ఈనెల మూడో తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసు దాఖలు చేసేందుకు కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది.

    ఇక ... ఓ భారీ చిత్రం ఫెయిల్యూర్ అనేక తలనొప్పులను తీసుకు వస్తుంది. రీసెంట్ గా ...సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది నష్టపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వమని వారు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ మేరకు నిర్మాతతో చర్చలు సైతం జరిగాయి..జరగుతున్నాయి.

    కానీ ఈ చర్చల్లో చివరగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తాను 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో వారు మళ్ళీ ఎదురు దాడికి దిగారు. అందుకే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి సరికొత్తగా వారి నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్ళందరూ రజినీకాంత్ ఇంటివద్ద, లింగా థియేటర్స్ ముందు బిక్షం ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నారు.

    వారంతా సమావేశమయ్యి... ఇక నుంచి రజినీకాంత్ ఇంటి ముందు బిక్షాటన చేయాలని, అలాగే ఏ ఏ థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసారో అక్కడ రోజు అడుక్కోవాలని వారు నిర్ణయించుకున్నారు.

    అంతే కాకుండా ప్రతి సినిమా థియేటర్లో ఒక బిక్షం ఎత్తుకునే ఒక బౌల్ పెట్టి అందులో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వీలైనంత దానం చెయ్యాలని కోరటం. వాళ్ళు ఇచ్చే డబ్బు మా రికవరీకి కొంతైనా హెల్ప్ అవుతుందని వారు అంటున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

    English summary
    There are seven leading directors including Shankar, AR Murugadass, Hari, P Vasu, Karthik Subbaraj, SS Rajamouli in the race to direct Superstar Rajinikanth's next movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X