Don't Miss!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- News
ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన రష్యా..!!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సూర్య 'సెవెంత్ సెన్స్' పై బ్యాన్ !?
సూర్య తాజా చిత్రం సెవెంత్ సెన్స్...టాక్ డివైడ్ గా ఉన్నా వసూళ్లు మాత్రం ఓ రేంజిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు శ్రీలంకలో బ్యాన్ పెట్టే అవకాశమున్నట్లు సమాచారం. అందుకు అక్కడి కొన్ని సంఘాలు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడులో మాత్రం ఇది తమ చరిత్రను వెలికి తీసిన ఆణిముత్యం అంటూ మెచ్చుకుంటున్నారు.శ్రీలంకలో తమిళ వెర్షన్ విడుదలై అక్కడా మంచి టాక్ తెచ్చుకుంది కానీ సినిమాలోని అరవింద్ క్యారెక్టర్ చెప్పిన ..తొమ్మిది దేశాలు కలిసి ఒకే దేశాన్ని టార్గెట్ చేయటం,ద్రోహం అనిపించుకుంటుంది అనే డైలాగుకు వారు కోపోద్రికులవుతున్నారు. వారు సినిమాని బ్యాన్ చేయాలని అక్కడ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సూర్య పోషించిన భోధి దమ్మ పాత్రను దేముగా చూపటం కూడా వారు తప్పు పడుతున్నారు. ఇక సెవెంత్ సెన్స్..ఆరవ శతాబ్దంలో తమిళనాడు తంజావూరులో జన్నించిన పల్లవ రాజు చెైనా వెళ్లి అక్కడ వారిని ఉద్దరించి మహాత్ముడు అవటం చూపుతుంది.అలాగే ఇప్పటి తరంలో అరవింద్ అనే సర్కస్ లో పనిచేసే వ్యక్తి ఆ కుటుంబానకి చెందిన వారసుడు అవటం, అతనిలో భోధిధమ్మ డిఎన్ ఎ ని ప్రేరేపించి మళ్లీ భోదిదమ్మని ఈ కాలం లోకి తీసుకురావటం అనే కాన్సెప్టుతో సినిమా నడుస్తుంది.ముయాన్రుగదాస్ దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది. లక్ష్మి గణపతి ఫిలింస్ వారు తెలుగులో ఈ చిత్రాన్ని అందించారు.