For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరిపోయే ఛాన్స్... ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాజల్

  By Srikanya
  |

  చెన్నై: తెలుగులో నెంబర్ వన్ రేసులో ఉన్న హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ఆమె తెలుగు మాత్రమే కాక, తమిళంలోనూ తన హవా నడిపిస్తోంది. తాజాగా ఆమె ఓ ట్రైలింగ్వువల్ చిత్రం ఓకే చేసింది. ప్రముఖ చాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ దర్శకుడుగా మారుతూ డైరక్ట్ చేయనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ చిత్రంలో జీవా హీరోగా చేయనున్నారు. ఈ మేరకు ఆమెకు భారి రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ తాను కలలో కూడా ఊహించలేదని అంటోందామె.

  దర్శకుడు రవి.కె.చంద్రన్ గతంలో రంగ్ దే బసంతి, దిల్ చాహతా హై వంటి భారి చిత్రాలకు అద్బుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. అలాగే హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దాంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. కాజల్ పాత్ర కూడా చాలా డిఫెరెంట్ గా తీర్చి దిద్దారని, ఇప్పటివరకూ ఆమె చేయని పాత్ర అని అంటున్నారు. రంగంతో పరిచయమైన జీవా హీరో కాబట్టి మాగ్జిమం స్ట్రైయిట్ చిత్రం తరహాలో బిజినెస్ జరగ వచ్చని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ''ఈ దీపావళి వెలుగులన్నీ నావే. పండగకి అటుఇటుగా తమిళంలో నేను నటిస్తున్న 'తుపాకీ', 'మాత్రన్‌' చిత్రాలు విడుదలవుతాయి. ఆ తర్వాత వరుసగా నేను నటించిన తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయని'' అంది కాజల్‌. ఆమె తెలుగులో బాద్షా, ఎవడు, నాయక్ చిత్రాల్లో చేస్తోంది. నాయక్ చిత్రం మొదటి రిలీజ్ కానుంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

  అలాగే హాట్ ఫోటో షూట్ ల గురించి మాట్లాడుతూ... ''ఒకట్రెండు ఫొటోల్లో హాట్‌గా కనిపించినంత మాత్రాన నాయిక ప్రతిభను ఎలా లెక్కగడతారు'' అని ప్రశ్నిస్తోంది. దక్షిణాదితో పోలిస్తే... హిందీలో హారోయిన్స్ మరింత గరమ్‌ గరమ్‌గా కనిపిస్తుంటారు. అయితే కాజల్‌ మాత్రం 'సింగమ్‌'లో తనదైన శైలిలోనే కనిపించింది. కురచ దుస్తులు ధరించడానికి మీరు ఒప్పుకోరా? అని అడిగితే... ''ఆ విషయంలో నాకు పట్టింపులేమీ లేవు. అయితే నేనెలా కనిపించాలనే విషయం నాకంటే ఎక్కువగా నా దర్శకులకే తెలుస్తుంది. కథ, పాత్ర డిమాండ్‌ చేసినట్టుగానే తెరపై కనిపించాలనుకొంటాను'' అని చెప్పుకొచ్చింది.

  English summary
  Kajal Agarwal will be the leading lady of a big film. The untitled film will be a tri-lingual, to be shot in Tamil, Telugu and Hindi. Kajal will be paired up with Jeeva of Rangam fame. Sources tell us that Kajal has been paid huge remuneration for this movie. Well known cinematographer Ravi K Chandran, of films like Dil Chahta Hai and Rang De Basanti will be debuting as director with this film. Shooting will commence shortly in Hyderabad very soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X