»   » సూర్య ఎస్3 (సింగం-3) పై హై కోర్ట్ లో కేసు, ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ

సూర్య ఎస్3 (సింగం-3) పై హై కోర్ట్ లో కేసు, ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న సూర్య హీరోగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 23 న భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి ప్రి రిలీజ్ బుకుంగ్ మొదలైంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ఇప్పడు ఓ సమస్య వచ్చి పడింది.

చెన్నైకు చెందిన దేవరాజన్ అనే వ్యక్తి చెన్నై హై కోర్టులో ఎస్ 3 చిత్రం నిర్మాతలపై ఓ పిటీషన్ ఫైల్ చేసారు. ఆన్ లైన్ టిక్కెట్ బుక్కింగ్ వెబ్ సైట్స్ వారు ఈ చిత్రానికి సంభందించి గవర్నమెంట్ నిర్దేశించిన ఎమౌంట్ కన్నా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టు..తమిళ నాడు గరవ్నమెంట్ ని, ఎస్ 3 నిర్మాతలను డిసెంబర్ 21 వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

A Case filed in Chennai High Court against Suriya's S3

తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ టీజర్‌తో పాటు తెలుగు వెర్షన్ టీజర్‌కు కూడా అద్భుత స్పందన లభిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర టీజర్ తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌కు ఎస్-3 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు దాదాపుగా టీజర్ ఒక కోటి వ్యూస్ పైగా సాధించింది.

మొదటి రెండు సినిమాల కన్నా ఈ ఎస్-3 మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. సూర్యను పవర్ ఫుల్ పోలీస్ గా చూపిస్తే స్క్రీన్ మీద ఆ ఎనర్జీనే వేరేలా ఉంటుంది. అనుష్క, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అసలైతే దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని కార్తి కాష్మోరాకు పోటీగా ఎందుకని అనుకున్నాడో ఏమో తన సినిమాను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు సూర్య.

ఎస్-3 మీద భారీ రేంజ్లోనే అంచనాలున్నాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఎస్-2 అందరిని ఆశ్చర్య పరిచే రేటుకి బిజినెస్ జరిగింది. మరి తారా స్థాయిలో అంచనాలను సినిమా ఏవిధంగా చేరుకుంటుందో తెలుసుకోవాలంటే డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే.

English summary
Suriya's S3 is heading for worldwide theatrical release on 23rd December. And now a case has been filed in Chennai High court, objecting to online ticket booking websites collecting additional charges than the amount prescribed by the government.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu