»   »  మే నుంచి 'బిర్యాని' డైరక్టర్ తో ఖరారు

మే నుంచి 'బిర్యాని' డైరక్టర్ తో ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : తన తమ్ముడు కార్తీతో 'బిరియాని'ని వెంకట్‌ప్రభు తెరకెక్కించిన విధానానికి ముచ్చటపడిన సూర్య ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి కనబర్చాడు. దానికి తగిన విధంగానే సూర్య కోసం ఓ కథను వినిపించాడు వెంకట్‌ప్రభు. వెంటనే సూర్య నుంచి పచ్చజెండా వచ్చింది. ఈ నేపథ్యంలో మేలో చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకబిగిన పూర్తి చేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల చెంతకు తీసుకురావాలనే యోచనలో ఉన్నాడట దర్శకుడు. ముఖ్యంగా చిన్నారులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేసుకున్నట్లు వెంకట్‌ప్రభు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

  'బిరియాని'తో కార్తీకి మంచి హిట్‌ అందించిన విలక్షణ దర్శకుడు వెంకట్‌ప్రభు.... సూర్యతో తన కొత్త చిత్రాన్ని మేలో ప్రారంభించనున్నాడు. 'సింగం-2' హిట్‌ అనంతరం సూర్య ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్‌'లో నటిస్తున్నాడు. గత నవంబర్‌లో మొదలైన దీని షూటింగ్‌ ప్రస్తుతానికి 50శాతం పూర్తయింది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  A mega film for Surya and Venkat Prabhu

  లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

  ఇక తన కొత్త సినిమా కోసం కమల్‌హాసన్‌ నటించిన చిత్రం శీర్షికను సూర్య ఎంచుకున్నారు. 'బిరియాని' తర్వాత వెంకట్‌ప్రభుతో తెరకెక్కించనున్న చిత్రానికి 'కల్యాణరామన్‌' అనే పేరు పెట్టారు. ఈ పేరుతో అప్పట్లో కమల్‌ హీరోగా ఓ చిత్రం వచ్చింది. పేరు పెట్టే ముందు కమల్‌తోపాటు ఆ చిత్ర దర్శకుడు పంజు అరుణాచలానికి కూడా విషయాన్ని వివరించారట వెంకట్‌ప్రభు. చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా బాణీలు సమకూర్చనున్నారు. ఇది రీమేక్‌ కాదని... పేరు మాత్రమే పాతదని, కథ కొత్తదేనని వెంకట్‌ప్రభు స్పష్టం చేస్తున్నారు.

  English summary
  It is official. Suriya and Venkat Prabhu will be coming together for a mega budget film that will be produced by Gnanavel Raja of Studio Green and not by the actor’s newly launched banner, 2D Entertainment, as speculated by a section of the media. It is unclear whether the film’s script and genre are the same as that mentioned by the director to this newspaper a few years ago.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more