»   » 'రోబో' చిత్రంపై పోలీస్ కమీషనర్ కి కంప్లైయింట్

'రోబో' చిత్రంపై పోలీస్ కమీషనర్ కి కంప్లైయింట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్‌ తాజా చిత్రం 'రోబో' విడుదలై ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఓ తమిళ రచయిత కథ తనదేనంటూ పిర్యాదు చేసారు. అముద అనే కలం పేరుతో రచనలు చేసే అరూర్‌ తమిళ్‌నాదన్‌ అనే ఈ వ్యక్తి ఈ మేరకు చెన్నై పోలీస్‌ కమిషనర్ ‌కు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 1996లో ఇనియ ఉదయం, 2007లో థిక్‌ థిక్‌ దీపిక్‌ అనే తమిళ పత్రికల్లో ప్రచురితమైన తన కథానిక 'జుగిబా'ను రోబో మూలకథనంగా చౌర్యం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్‌ 1వ తేదీన 'రోబో' సినిమా విడుదలైన తర్వాత ఆ చిత్రాన్ని చూసిన తన ప్రెండ్స్, పాఠకులు ఫోన్‌ చేసి అది 'జుగిబా' కథానికకు కార్బన్‌ కాపీయేనని చెప్పారని ఆ కంప్లైంయింట్ తో తెలిపారు.

అలాగే తమిళ్ ‌నాదన్‌ ఆ రెండు ప్రచురణల్లో వచ్చిన ముద్రణ ప్రతులను రుజువులుగా ఈ ఫిర్యాదుకు జతపరిచారు. ఇక రోబో సినిమాలో తన కథకు పాటలు, పోరాట దృశ్యాలు, గ్రాఫిక్స్‌ మాత్రం చేర్చి మరింత అందంగా తీర్చిదిద్దారని ఆరోపించారు. భారత వార్తాపత్రికల రిజిస్ట్రార్‌ వద్ద నమోదయి ఉన్న పత్రికలో ప్రచురితమైన తన కథానిక ఆధారంగా వచ్చిన ఈ సినిమా కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపణ చేసిన తమిళ్ ‌నాదన్‌, ఇందుకు సంబంధించిన అనుమతులకోసం చిత్ర నిర్మాతలు తననుగానీ, ఇనియ ఉదయం పత్రికనుగానీ సంప్రదించలేదన్నారు. పైగా రోబో సినిమా కథపై 1997-98 నుంచీ ఆలోచనలు ఉన్నట్లు శంకర్‌ చెప్పుకున్న విషయాన్ని కూడా గమనించాలని ఈ రచయిత గుర్తు చేశారు. ఇక తెలుగులోనూ విజయార్కే అనే రచయిత ఈ రోబో కథ తనదే నంటూ మీడియాకెక్కి గొడవ చేసిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu