»   » 'యుగానికి ఒక్కడు'తమిళంలో ఫట్టా?

'యుగానికి ఒక్కడు'తమిళంలో ఫట్టా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఆయిరత్తిల్‌ ఒరువన్‌' తమిళంలో రూపొంది ఇటీవలే విడుదలైంది.దాన్నే తెలుగులో 'యుగానికి ఒక్కడు'గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నిర్మాతలు చెపుతున్నట్లుగా ఈ చిత్రం అక్కడ ఘన విజయం ఏమీ సాధించలేదని తెలుస్తోంది. ఓపినింగ్స్ బాగా వచ్చినా నిలబడలేదని పెద్ద డిజప్పాయింట్మెంట్ గా అక్కడ పత్రికలు పేర్కొన్నాయి. అలాగే ఈ చిత్రంలో సెల్వరాఘవన్ బాగా ఖర్చుపెట్టించి కథను పట్టించుకోకపోవటమే సినిమా పరాజయానికి కారణమని పేర్కొనటం విశేషం. ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటించారు.

రీమాసేన్‌, ఆండ్రియా, పార్తీబన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగులో డ్రీమ్‌ వాలీ కార్పొరేషన్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు తెలుగు డబ్బింగ్ చేసిన అందిస్తున్నాయి. పిబ్రవరి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా హీరో కార్తీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...అక్కడ 'ఆయిరత్తిల్‌ ఒరువన్‌' సూపర్‌ హిట్టయింది. కలెక్షన్లు భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమాలోని ప్రతి ఫ్రేమూ అద్భుతం అంటున్నారు. తెలుగులోనూ అలాంటి స్పందనే వస్తుందనీ, గ్రాండ్‌ ఫిల్మ్‌ అవుతుందనీ ఆశిస్తున్నా. కథ, పాటలు, విజువల్స్‌..అన్నీ అద్భుతమే ఈ సినిమాలో.అలాగే ఇది తెలుగులో వచ్చిన 'అరుంధతి', 'మగధీర' సినిమాల లాంటి సినిమా అని ప్రమోట్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu