»   » కుట్రపన్నిన వారిని పట్టించుకోను

కుట్రపన్నిన వారిని పట్టించుకోను

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నటుడిగా, దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు నటుడు అర్జున్‌. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'జైహింద్‌ 2'. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... తనపై కుట్రపన్నే వారి గురించి అస్సలు పట్టించుకోను అని అన్నారు. దాంతో అర్జున్ పై కుట్ర పన్నిందెవరు అనే టాపిక్ తమిళ చిత్ర పరిశ్రమలో మొదలైంది.

అర్జున్‌ మాట్లాడుతూ.. 'నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి.. ప్రపంచానికి పరిచయం చేసింది సినిమానే. అన్ని పరిశ్రమల్లోనూ మంచీచెడులుంటాయి. వాటిలో నేను మంచిని మాత్రమే తీసుకుంటాను. కుట్రపన్నే వారి గురించి అస్సలు పట్టించుకోను 'అని చెప్పారు.

ఇక తాజా చిత్రం గురించి చెప్తూ... ఇరవై ఏళ్లక్రితం విడులైన 'జైహింద్‌' దేశభక్తిని చాటిన చిత్రం. ఈ చిత్రం చదువు ప్రాధాన్యత గురించి చెబుతుంది. ఆలయం లేని ఊరిలో నివసించకూడదని చెబుతారు. నాకు తెలిసినంత వరకు పాఠశాలలే ఆలయాలు. కానీ ఇప్పుడు విద్య.. వ్యాపారంగా మారిపోయింది. దీనికి వ్యతిరేకంగా సాగే కథే 'జైహింద్‌ 2' అన్నారు.

Action King Arjun About his latest movie

అలాగే... నేను ఇండస్ట్రీకి వచ్చి 30ఏళ్లు గడిచిపోయింది. నా వారసురాలు ఐశ్వర్య కూడా పరిశ్రమలోకి వచ్చేశారు. ఇప్పటికీ నాకు పలు భాషల చిత్రాల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం 'జైహింద్‌ 2'పైనే దృష్టి పెట్టా. ఇది మంచి యాక్షన్‌ కలగలసిన సందేశాత్మక చిత్రం. ప్రతి ప్రేక్షకుణ్ని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది' అన్నారు.

అర్జున్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్‌ చిత్రం 'జైహింద్‌ 2'. శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరుపై రూపొందుతున్న ఈ సినిమాలో సుర్విన్‌ చావ్లా, సిమ్రన్‌కపూర్‌ హీరోయిన్స్. రాహుల్‌దేవ్‌, బ్రహ్మానందం, రవి, మయిల్‌స్వామి, మనోబాలా, బేబి యునితా తదితరులు నటిస్తున్నారు. వైరముత్తు పాటలు రాశారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

అర్జున్‌ మాట్లాడుతూ.. ''దేశం అభివృద్ధి సాధించాలంటే ధనబలం, దళ బలానికన్నా మరో ముఖ్యమైన బలం విద్య. ఆ విషయాన్నే సినిమాలో ప్రస్తావించాం. విద్య ఉంటే దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి, తల్లిదండ్రులు చూడదగ్గ చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమాను ఐరోపాలో చిత్రీకరిస్తున్నాం. పలు ఛేజింగ్‌ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే సింగపూర్‌లో కొంత చిత్రీకరణ జరిపాం. ''అని తెలిపారు.

English summary
Jai Hind 2 is an action drama film produced and directed by Arjun . It is a sequel to the Tamil film Jai Hind.
Please Wait while comments are loading...