»   » దిల్ రాజు పై మండిపడుతున్న యాక్షన్ కింగ్ అర్జున్

దిల్ రాజు పై మండిపడుతున్న యాక్షన్ కింగ్ అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ హీరో రామ్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్ లో దిల్ రాజు ఆ మధ్యన 'రామరామ కృష్ణకృష్ణ' చిత్రం నిర్మించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని దిల్ రాజు తమిళ నిర్మాతలుకు అమ్మేసారు. తమిళంలో అర్జున్ కి ఆరు నుంచి ఏడు కోట్ల వరకూ మార్కెట్ ఉంది. దాంతో మంచి రేటుకే ఈ చిత్రం అమ్ముడైంది. ఇక ఈ చిత్రం ఒప్పుకునేటప్పుడే అర్జున్ ఈ చిత్రాన్ని తమిళంలో అనువదించకూడదని ఓ షరతు పెట్టారు. నిర్మాత సరే అన్నారు. తీరా తెలుగులో ఈ చిత్రం డిజాస్టర్ కావటంతో ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని డబ్బింగ్‌ హక్కులు అమ్మేశారు. ఈ విషయం తెలియడంతో అర్జున్‌ చాలా బాధపడ్డారట. నోటి మాటపై చేసుకున్న ఎగ్రిమెంట్ కాబట్టి ఏమీ చేయలేకపోతున్నానని...భవిష్యత్తులో నిర్మాతలతో అగ్రిమెంట్‌ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారట. వాస్తవానికి అర్జున్‌ తమళ్ కాక వేరే ఏదైనా భాషలో నటించిన సందర్భంలో వాటిని తమిళంలోకి డబ్‌ చేయడానికి అంగీకరించరు. డబ్బింగ్‌ సినిమాలు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి తమిళంలో తన మార్కెట్‌ డిస్టర్బవుతుందనేది అర్జున్‌ ఆలోచన.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu