twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బు కక్కుర్తే కొంప ముంచింది: పోలీసులకు లొంగిపోయిన అమలా పాల్

    By Bojja Kumar
    |

    Recommended Video

    డబ్బు కక్కుర్తే కొంప ముంచింది.. పోలీసులకు లొంగిపోయిన అమలా పాల్..!

    హీరోయిన్ అమలా పాల్ పోలీసులు లొంగిపోయారు. కొన్ని రోజులుగా పన్నుఎగవేత కేసు ఎదుర్కొంటున్న ఆమె ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. అనంతరం బెయిల్ తీసుకుని వెళ్లి పోయారు.

    డబ్బు కక్కుర్తే

    డబ్బు కక్కుర్తే

    2017లో అమలా పాల్ రూ. 1 కోటి విలువ చేసే ఖరీదైన కారు కొన్నారు. అయితే కేరళలో రిజిస్ట్రేషన్ చేయిస్తే పన్ను ఎక్కువ కట్టాల్సి వస్తుందని కక్కుర్తి పడిన ఆమె తాను పాండిచ్చేరి వాసిగా దొంగపత్రాలు క్రియేట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంది.

    పోలీసులకు దొరికిపోయింది

    పోలీసులకు దొరికిపోయింది

    తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు గుర్తించిన పోలీసులు ఆమెపై 430, 468, 471 సెక్షన్ల కింద కేరళలో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇటీవల ఆమె కేరళ హైకోర్టును సంప్రదించి, ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో న్యాయస్థానం క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

    తప్పు ఒప్పుకుంది

    తప్పు ఒప్పుకుంది

    అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.

    మీడియాకు ముఖం చాటేసిన వైనం

    మీడియాకు ముఖం చాటేసిన వైనం

    పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. గతంలో అమలా పాల్ తాను ఏ తప్పూ చేయలేదు, మీడియా నన్ను అనవసరంగా ఆడిపోసుకుంటోందంటూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

    గతంలో వీరు కూడా

    గతంలో వీరు కూడా

    గతంలో మలయాళ నటులు సురేష్ గోపి, పహాద్ ఫాజిల్ తదితరులు కూడా ఇలాంటి కేసు ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టాడినికి అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు.

    English summary
    Actor Amala Paul on Monday surrendered before the the Crime Branch (CB) after the agency had indicted her in November last for having used phoney documents to fraudulently register her super luxury car in Puducherry to dodge the steep tax on opulent vehicles in Kerala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X