»   » సెట్లో నిజంగానే కొట్టిన హీరో..ఆగిన షూటింగ్

సెట్లో నిజంగానే కొట్టిన హీరో..ఆగిన షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమా షూటింగ్ లో భాగంగా కొట్టుకుంటూంటారు..చంపుకుంటారు. అయితే ఆఫ్ స్క్రీన్ లో అంతా కలిసే ఉంటారు. అయితే ఎమోషన్ ఎక్కవై...నిజంగా ఎదుటివారిని హీరోగారు కొట్టేస్తే..అది ఎంతవరకూ అయినా వెళ్తుంది. రిలేషన్స్ దెబ్బతింటాయి. అలాంటి సంఘటనే రీసెంట్ గా తమిళ చిత్రం ‘పోక్కిరిరాజా' షూటింగ్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..నిజ జీవితంలో జీవా, సత్యరాజ్‌ కుమారుడు శిబిరాజ్‌లు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ‘పోక్కిరిరాజా' చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేకుని.. చివరి మాట్లాడుకోనంత స్థాయికి వచ్చింది.

Actor Jeeva And Sibiraj Had a real Fight

ఈ సినిమాలోని ఫైట్ సీన్స్ షూటింగ్ ఇటీవల జరిగింది. సీన్ ప్రకారం జీవాను శిబిరాజ్‌ కొట్టాలి. తర్వాత జీవా కూడా శిబిని కొట్టే సందర్భంలో ఎమోషన్‌ ఆశించిన స్థాయిలో లేదని, మళ్లీ చేయాలని దర్శకుడు కోరారు.

రెండోసారి ఆ పాత్రలో నిజంగానే లీనమైన జీవా.. శిబిరాజ్‌ను చెంప ఛెళ్లుమనేలా కొట్టడంతో శిబిరాజ్‌కు కోపం వచ్చింది. షూటింగ్‌ ఆగిపోయింది. ఇద్దరికీ సర్దిచెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించారు. కానీ ప్రస్తుతం వారిద్దరూ మాట్లాడుకుంటున్నారో లేదో తెలియదని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

English summary
Jeeva, Sibi Real Fight In Pokkiri Raja Shooting Spot. Selvakumar’s own production house – PTS Film International’s latest venture is the Jiiva, Sibi Raj and Hansika Motwani starrer – POKKIRI RAJA
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu